Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

దళితుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Jagadish-Reddy

సూర్యాపేట: సూర్యాపేటలో జరిగిన దళితుల సదస్సులో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని మంత్రి అన్నారు. 1985లోనే మొట్టమొదట దళితజ్యోతిని ప్రారంభించింది కెసిఆరేనని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో అంబేడ్కర్ భవనాలతోపాటు వాటిలో వ్యాయమశాలలు ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ఎస్‌సి రెసిడెన్షియల్‌లను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.5 లక్షల సబ్సిడీతో ఎస్‌సి యువత ఉపాధికి రూ.10 లక్షల రుణాలు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు మంత్రి ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 73 గ్రామాల దళిత యువతకు 162 క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు.

Minister Jagadish Reddy says Special Activities for Dalit Development.

Comments

comments