Search
Tuesday 19 June 2018
  • :
  • :

టిఆర్‌ఎస్ ప్రభుత్వమంటే ప్రతిపక్షాలకు భయం

KTR-

హైదరాబాద్ : ప్రజారంజక పాలన చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వమంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలంగాణ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రైతులకు 24గంటల కరెంట్ ఇస్తుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు, ఆధారాలు ఉంటే కోర్టులకు వెళ్లాలని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో చర్చ చేద్దామంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, బయట మాత్రం రచ్చ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే ఫార్మాసిటీ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. తాను విదేశాల్లో నాలుగు రోజుల పాటు పర్యటిస్తున్నట్టు ఆయన తెలిపారు. తన పర్యటనలో పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల గురించి మాట్లాడుతానని, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. జైలుకు వెళ్లి వచ్చిన వారు కూడా నీతి గురించి మాట్లాడడం సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు. తమ పాలనపై ప్రపతిపక్షాలు ఎంత రచ్చ చేసినా, ప్రజలు నమ్మే స్థితిలో లేరని కెటిఆర్ స్పష్టం చేశారు.

Minister KTR Comments on Opposition Parties

Comments

comments