Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

జైల్లో చిప్పకూడు తిన్నవారు అవినీతిపై మాట్లాడటమా?

KTR-and-Revanth-Reddy

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత 24 గంటల విద్యుత్‌పై అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రైవేటు వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోందని తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీనిపై చర్చకు రావాలంటూ టిఆర్‌ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నారు. ఈ విషయమైన టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్, రేవంత్‌ల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తాజాగా రేవంత్ విమర్శలపై మంత్రి కెటిఆర్ పరోక్షంగా చూరకలంటించారు. జైల్లో చిప్పకూడు తిన్నవారి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కరెంట్ కొనుగోలు అవకతవకలపై ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నారు. జైల్లో చిప్పకూడు తిన్నవారు అవినీతి గురించి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం తమకు లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఇక ఈ నెల 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న విషయం విదితమే.

Comments

comments