Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

ఓటేయలేదని దారుణం..!

Minor-gangraped-and-Murdere

రాంచీ: ఎన్నికల్లో తన సతీమణికి ఓటు వేయకపోవడంతో ఓటమి పాలైందని ఓ వ్యక్తి ఒక కుటుంబంపై కక్ష సాధింపు చర్యలో భాగంగా దారుణానికి పాల్పడ్డాడు. సదరు ఫ్యామిలీకి చెందిన 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి తన సోదరులతో కలిసి సామూహిక అత్యాచారం చేయడంతో పాటు అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని పకూర్ జిల్లాలో ఈ నెల 8న జరిగింది. ఘటన వివరాల్లోకి వెళితే… ఇటీవల స్థానిక లిట్టపరా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రేమ్‌లాల్ హంసద అనే వ్యక్తి సతీమణి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె పరాజయం పొందారు. దీంతో తన భార్య ఓడిపోవడానికి కారణం బాధిత కుటుంబమని వారిపై పగ పెంచుకున్నాడు ప్రేమ్‌లాల్.

ఈ క్రమంలో జనవరి 8న ఆ కుటుంబాయినికి చెందిన ఓ 13ఏళ్ల బాలిక బహిర్భూమికని వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ప్రేమ్‌లాల్ వరసకు సోదరులయ్యే వారితో కలిసి బాలికను అపహరించాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బాధితురాలు ఎక్కడ బయటపెడుతుందోనని ఆమెను చంపి అడవిలో పడేశారు. అయితే బహిర్భూమికని వెళ్లిన కూతరు ఎంతకీ తిరిగి రాపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలించగా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. దాంతో బాలిక కుటుంబ సభ్యులు ప్రేమ్‌లాల్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తన సోదరులతో కలిసి బాలికను గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన్నట్లు తెలిపాడు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

comments