Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఎమ్మెల్యేతో మైనార్టీ నాయకుల భేటీ

gita

మన తెలంగాణ / జహీరాబాద్ : మైనార్టీ ముస్లీంలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరుతూ మంగళవారం మైనార్టీ కమిటీ నాయకులు ఎమ్మెల్యే జె గీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవరం పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే గీతారెడ్డితో మైనార్టీ నాయకులు భేటీ అయ్యారు. తమ సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేస్తోందని, ఈ విషయంపై  అసెంబ్లి సమావేశాల్లో లేవనెత్తి మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు వచ్చేలా పోరాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తలాక్ తలాక్ తలాక్ విషయంలో తొందర పాటు చర్యలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, అందుకు మైనార్టీలు ఆమెకు అండగా ఉంటామని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కమిటీ బాధ్యులు మోయిజోద్దిన్, సయ్యద్ జలీల్, యండి అజీజ్, యండి అజీజ్, యండి యుసూఫ్, యండి ఇఫ్తార్, యండి ఇఫ్తాకర్, యండి అక్బర్, మోయిజ్ పాల్గొన్నారు.

Comments

comments