Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

శరవేగంగా మిషన్ భగీరథ పనులు

mantri

*దేశాయిపేటలో తాగునీటి సరఫరాను ప్రారంభించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మనతెలంగాణ/బాన్సువాడ: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికీ తాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా దేశాయిపేట గ్రామంలోని మొత్తం 704 ఇళ్లలో కుళాయిలు బిగింపుతో జిల్లాలో మొత్తం 832 నివాస సముదాయాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా మొత్తానికి మిషన్ భగీరథ ద్వారా నీరందించడానికి మొత్తం రూ. 2వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇంట్లో మహిళల కష్టాలకు సెలవు ప్రకటించాలని, కుళాయిల దగ్గర కొట్లాటలు ఇక ఉండవని, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మన ముఖ్యమంత్రి చేసి ఇంటింటికీ త్రాగునీరు అందించారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఈ పథకాన్ని చూపి కితాబిస్తున్నారన్నారు. అసాధ్యాన్ని సుసా ధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. నియోజక వర్గ పరిధిలో మొత్తం 70697 ఇళ్ళు ఉన్నాయని, మరొక నెల రోజుల్లో అన్ని పనులను పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వచ్చే ఏడాది ను ంచి కాళేశ్వరం ద్వారా గోదావరి నీటితో నిజాంసాగర్ ప్రాజెక్టును నింపి ఏటా రెండు పంటలకు నీరందిస్తామన్నారు. ముందస్తు పెట్టుబడిగా రైతులకు ఎకరానికి రూ. 8వేల అందిస్తామన్నారు.  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ సంపత్‌గౌడ్, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

comments