Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

మిషన్ భగీరథ పనులు సకాలంలో పూర్తి చేయాలి

hall

*పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ల,అధికారులకు ఆదేశం
*పనుల్లో నిర్లక్షం చేస్తే చర్యలు తీసుకుంటాం
*సమీక్షా సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడి

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: మిషన్ భగీరథ పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం అవంతీపురంలో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో మిషన్ భగీరథ, ఇంట్రావిలేజ్ పనులపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏకే బీఆర్ సిగ్మెంట్, ఉదయ సముద్రం సెగ్మెంట్‌లలో మిషన్ భగీరథ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. టెయిల్ పాండ్ సెగ్మెంట్‌లోని పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని వీటిని వేగవంతం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ, కింద చేపట్టిన నిర్మాణాలు వాటర్ ట్రిట్‌మెంట్ ప్లాంట్ లు, పైపులైన్ల నిర్మాణం, ఓహెచ్‌ఆర్ నిర్మాణం ఫిల్టర్ బెడ్స్ నిర్మాణం, సంపుల నిర్మాణం, నిర్ణిత సమయానకి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషణ్ భగీరథ పథకాన్ని సిఎం కార్యాలయంలో మంత్రి జగదీష్‌రెడ్డి జిల్లా స్థాయిలో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ పథకాన్ని అనుకున్న సమయంలోగా విధిగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. పైపులైన్ల నిర్మాణంలో ఎక్కడైనా భూ సమస్య ఉన్నట్లైతే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత తహ సీల్దార్లకు కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ పనులు ఈ నెల చివరి లోగా పూర్తి చేసి ట్రైల్న్ నిర్వహించాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు ఏ కాంట్రాక్టరైనా నిర్లక్షం చేసినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని హెచ్చరించారు. సిగ్మెట్ల వారీగా నిర్మాణాలు పైప్‌లైన్ల పనులు ఎంతవరకు పూర్తయినవి, ఎప్పటి వరకు పూర్తి చేస్తారని అడిగి, కాంట్రాక్టర్లకు ఇచ్చిన తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇంట్రావిలేజ్ పనులను సమీక్షించారు. ఇంట్రావిలేజ్, ఓహెచ్‌ఆర్‌ల నిర్మాణం 65 శాతం వరకు పూర్తయిందని, మిగిలిన ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇంట్రావిలేజ్ పైప్‌లైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. అనంతరం అవంతీపురంలో నిర్మాణం జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించారు. కృష్ణాపూర్‌లోని మిషన్ భగీరథ పైపులైన్ల పనులను, వెంకటాద్రిపాలెంలోని కేశవనగర్‌లోని ఇంట్రావిలేజ్ పైప్‌లైన్ పనులు, ఓహెచ్‌ఎస్ ఆర్ నిర్మాణ పనులను పరిశీలించారు. కేశవనగర్‌లో 240 గృహాలున్నాయని, వీటన్నింటికి పైపులైన్ల నిర్మాణం పూర్తి అయిందని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్సీ మధుబాబు, ఆర్‌డబ్లూస్ ఈఈ పాపారావు, మిర్యాలగూడ ఆర్‌డీవో గోపాల్, మిషన్ భగీరథ ఈఈలు, డీఈలు, ఏఈలు, మిర్యాలగూడ, దామరచర్ల, త్రిపురారం తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments