Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

‘ఎంఎల్‌ఎ’ టీజర్ రిలీజ్

KALYAN

హైదరాబాద్ : నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంఎల్‌ఎ’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఎంఎల్‌ఎ గెటప్‌లో స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం, కండువా వేసుకోవడం ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఉపేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ చౌదరి, కిరణ్‌రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చిలో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా కల్యాణ్‌రామ్ ‘ నా నువ్వే ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన పక్కన తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాజల్ ‘ పారిస్ పారిస్ ’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘ క్వీన్ ’కు ఇది రిమేక్‌గా రాబోతోన్న విషయం తెలిసిందే.

 ‘MLA’ Telugu film Teaser Release on Sunday

Comments

comments