Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

మొక్కులన్నీ అమ్మలకే..

amma

మనతెలంగాణ/మంగపేట/తాడ్వాయి: తెలంగాణ కుంబమేళా తరహాలో జరుగనున్న మహాజాతరకన్నా ముందే మోక్కులన్ని అమ్మలకే అన్న రీతిలో భక్తులు శనివారం మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు అమ్మలను దర్శించుకుని తరించి పోయారు. గత జాతరలో అమ్మలను దర్శించుకుని మోక్కులు సమర్పించుకున్నామని అమ్మల్లు చల్లంగా చూస్తే వచ్చే జాతరకు మళ్ళీ అమ్మలను దర్శించుకుని ఒప్పుకున్న మోక్కులను భక్తి శ్రద్దలతో చెలించుకుంటామని భక్తులు అచంచల భక్తితో వేడుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి నిలువెత్తు బంగారాన్ని (బెల్లాన్ని) సమర్పించుకుని కొలివుదీరిని అమ్మలను మనాసారా మొక్కుకున్నారు. అమ్మల సన్నిదికి చేరుకున్న భక్తులు తమ కుటుంబ సబ్యులతో తమ సెల్‌ఫోన్‌లతో అమ్మల గద్దెలవద్ద నిలిబడి సెల్‌ఫీలను తీసుకుని సంబర పడ్డారు. గద్దెల ప్రాంగణంలో కుటుంబ సమేతంగా ఫోటోలు తీసుకుని సంతోష పడ్డారు. అనంతరం అమ్మలకు కోళ్ళు, మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గద్దెల ప్రాంగణంలో విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్ల వెలుతురులో గద్దెల ప్రాంగణం శనివారం అలారారింది.

Comments

comments