Search
Saturday 21 April 2018
  • :
  • :

ఇసుక తరలింపుపై ఉద్యమం

cong3

– అడుగంటుతున్న భూగర్భజలాలు
– వారంలో ప్రాజెక్టుల తాట
– మిడ్‌మానేరు, ఎల్లంపల్లిల నీరు వినియోగించాలి
– జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
కటకం మృత్యుంజయం

మన తెలంగాణ / కరీంనగర్ ప్రతినిధి : జిల్లా నుండి విచ్చలవిడిగా ఇసుకను తరలించడ మూలంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయని కరీంనగర్ జిల్లా కాం గ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకునే వారెవరని ప్రశ్నించారు. ఇసుకను స్థానిక అవసరాలకు వినియోగించాలని ఇతర ప్రాంతాలకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ వారం రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. లోపభూయిష్టమైన పాత జి.వోను రద్దు చేసి నూతన జి.వో.ను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వనరులను దోచుకునే విషయంలో దేశంలోనే తెలంగాణ ప్రభు త్వం మొదటిస్థానంలో నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో తాగునీటికి భయంకరమైన పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఇప్పటికే ఇసుక తరలింపు వలన భూగర్భ జలాలు 6 కిలోమీటర్ల లోతుకు వెళ్ళిపోయినట్లు పేర్కొన్నారు. ఇసుక వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ప్రభుత్వం జబ్బలు చరుచుకోవడం కాదని ప్రజల తాగునీటి అవసరాలను గురించి కూడా ఆలోచించాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఇప్పటికే తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇసుక లారీలు ఢీకొని అనేక మంది మృతి చెందుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇదిలా ఉండగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వలన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 15 లక్షల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందని దానిని కాపాడుకోవాల్సి బాధ్యత తమపై ఉందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మారో వారం రోజుల్లో ప్రాజెక్టుల బాట పేరుతో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని అన్నారు. ప్రాజెక్టుల వద్దనే ప్రజా సదస్సులను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. మిడ్‌మానేర్ సాగునీరు ముందు అప్పర్‌మానేర్‌కాలేక మల్లన్నసాగర్‌కా? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు సాగు, తాగు నీరు అందకపోతే యుద్దం తప్పదని మృత్యుంజయం హెచ్చరించారు.  విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రా జశేఖర్, అధికార ప్రతినిధి ఒంటెల రత్నాకర్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రకాశ్, నాయకులు రహమత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments