Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

ఢిల్లీలో ఎంపి కవిత బిజీ బిజీ

kavi

*స్పైస్ పార్క్‌కు
రూ.20 కోట్ల కేంద్ర సాయం
*ఫిబ్రవరి 3న పసుపు
రైతులు, వ్యాపారులకు
వర్క్‌షాపు
*తెలంగాణ స్పెషల్
టర్మరిక్ సెల్

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో
పసుపు రైతులకు నిజామాబాద్ ఎంపీ కల్వ కుంట్ల కవిత నూతన సంవత్సర కానుకలను అందజేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న ఆమె స్పైస్ పార్కుకు కేంద్ర సాయంతో పాటు తెలంగాణకు స్పెషల్ టర్మరిక్ సెల్‌ను సాధించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి సురేష్ ప్రభును నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం ఢిల్లీలో కలిసారు. నిజా మాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో స్పైస్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 42 ఎకరాల భూమిని కేటాయించి రూ. 30 కోట్లు మంజూరు చేసిందని మంత్రి సురేష్‌ప్రభుకు ఎంపీ కవిత తెలిపారు. డిపిఆర్‌ను స్పైస్ బోర్డు ప్రిపేర్ చేసిందని, పనులు వేగంగా జరుగు తున్నాయని వివరించారు. స్పందించిన మంత్రి సురేష్ ప్రభు రాష్ట్ర ప్రభుత్వ నిధులకు తోడుగా కేంద్రం తరపున రూ. 20 కోట్లు ఇచ్చేం దుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత పసుపు రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందిం చారు. మంత్రి సూచన మేరకు ఫిబ్రవరి 3న స్పైస్ బోర్డ్ చైర్మన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు హైదరాబాద్‌కు వస్తున్నారు. అదేరోజు హైదరాబాద్‌లో ఒక వర్క్‌షాపును నిర్వహిస్తారు. పసుపు పండించే రైతు లు, పసుపును ఎగుమతి చేసే వ్యాపారాలు పసుపు పంటతో అనుబంధం ఉండే వారు వర్క్‌షా పుకు హజరవుతారు.
టర్మరిక్ సెల్ ఏర్పాటు
తెలంగాణలో పసుపు రైతులను ఆదుకునే ందుకు స్పెషల్ టర్మరిక్ సెల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ సెల్‌ను ఫిబ్రవరిలో కేంద్ర వాణి జ్య, పరిశ్రమల మంత్రి సురేష్ ప్రభు ప్రారం భిస్తారు. ఈ సెల్ ద్వారా రైతులకు నాణ్యమైన పసుపు వంగడాలు లభిస్తాయి. పంటచేతికి వచ్చిన తరువాత ప్రాసెస్ చేసేందుకు రైతుల కు బాయిలర్‌లను అందజేసేందుకు నాబార్డ్ ను కోరతామని మంత్రి చెప్పారు. పసుపు రైతులకు మేలు చేసేందుకు పంటకు మంచి ధర వచ్చేలా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శాఖతో సంప్రదించి సంయుక్తంగా కార్యాచ రణ రూపొందిస్తామని ఎంపీ కవితకు మంత్రి సురేష్‌ప్రభు హామీ ఇచ్చారు. పసుపు రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మంత్రి సురేష్‌ప్రభుకు ఎంపీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు.

Comments

comments