Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ నేతలపై ఎంపి సుమన్ ఫైర్

MP-SUMAN

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్ మండిపడ్డారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గాంధీ భవన్ గోబెల్స్ భవన్‌గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లి లబ్ధి పొందాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్‌రెడ్డి విశ్వసనీయత లేని వ్యక్తి అని , దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. తాము చేసిన సవాల్‌కు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు స్పందించలేదని, అయితే రేవంత్‌రెడ్డి మాత్రం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండని ఎద్దేవా చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి కాకుండా కాంగ్రెస్‌లో విశ్వసనీయత ఉన్న వ్యక్తులే చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఎన్ని రోజులు ఉంటాడో అతడికే తెలియదని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

MP Suman Fire on Congress Leaders

Comments

comments