Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం.ఆర్.రావు

write

ఆయా శాఖాధికారులతో పనితీరును అడిగి తెలుసుకున్న కలెక్టర్ రామ్మోహన్‌రావు

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో
జిల్లాకు నూతన కలెక్టర్‌గా నియమింపబడ్డ ఎం. రామ్మోహన్‌రావు శనివారం ఉదయం కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా పనిచేసిన జెసి రవీందర్‌రెడ్డి నుండి బాధ్యతలు తీసుకున్నారు. నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయా శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సూపరింటెండెంట్లు, సెక్షన్ ఇన్‌ఛార్జీలు కూడా నూతన కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో చాలా రోజుల నుండి ఎక్కువ కాలం పనిచేస్తున్న సిబ్బంది ఎంత మంది ఉన్నారని ప్రశ్నించగా ఇద్దరి పేర్లు సూచించారు. ఇతర ప్రాంతాలకు బదిలీ తిరిగి కలెక్టరేట్‌లో పనిచేస్తున్నారని జెసి కలెక్టర్‌కు వివరించారు. ఎక్కువ కాలం పనిచేస్తున్న సిబ్బంది ఒకే సెక్షన్ నిర్వహిస్తున్నారా వివిధ సెక్షన్స్ నిర్వహిస్తున్నారా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు కలిసే సందర్భంలో అధికారి పేరు, హోదా చెప్పాలని సూచించారు. ఆయా శాఖలకు సంబంధించిన నోటును పంపించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క శాఖ సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఇన్‌చార్జీ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన జెసి రవీందర్‌రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, రెవెన్యూ సర్వే, అభివృద్ధి కార్యక్రమాలను అమలు తీరును ప్రగతిని నూతన కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, డాక్టర్ల బృందం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్బంలో ఆసుపత్రి వివరాలను వివరిస్తుండగా జిల్లాలో ఎక్కువ ఏ వ్యాధులపై చికిత్సకు వస్తున్నారు. ఎన్ని బెడ్‌లు ఉన్నాయని, ఎక్కువగా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల చికిత్సతో పాటుగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఈ రెండు నెలల్లో ఎక్కువగా ఏ వ్యాధుల వారు వచ్చారని చెప్పారు. అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకట్‌ను పిలిపించుకునే వైద్య ఆరోగ్య అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

గతంలో 22శాతం ప్రభుత్వాసుపత్రిలో డెలివరిలు ఉండగా కెసిఆర్ కిట్‌తో అంశాలు పెరిగిందన్నారు.  వందశాతం ఇమ్యూనైజేషన్ ప్రక్రియలో ప్రతిరోజు ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలు ప్రతి పిహెచ్‌సిలో అమలు చేస్తున్నాయని, గతంలో బుధవారం ఉండగా ప్రతిరోజు ఇమ్యూనైజేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.  నిజామాబాద్ నగరం పరిశుభ్రంగా ఉండాలి. పట్టణాన్ని చూడగానే ఆశ్చర్యంగా ఉండే విధంగా నగరాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ కమీషనర్‌కు ఆదేశించారు. చెత్తసేకరణ, సానిటేషన్ పని తీరు బాగా ఉండాలని చెత్త సేకరణలో మొత్తం ఎన్ని టన్నులు సేకరిస్తున్నారని కమీషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. నగరంలో చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. నల్లాల ద్వారా నీటి సరఫరా లేని ఏరియాలో ఏ విధంగా సరఫరా చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా మిషన్ భగీరథ కవరేజి లేని ప్రాం తాల్లో ఎలాంటి చర్యలు తీసుకోబుతున్నారని చెప్పారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పూర్తయిన వెంటనే వార్డుల్లో, రోడ్డు పనులకు శ్రీకారం చుట్టి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ వేసే సందర్బంలో నగర ప్రజలకు తాగునీరు ఇతర సమస్యలు ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. అంతే కాకుండా అట్టి పనిని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. నగరాభివృద్ది రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో 200 కోట్ల మంజూరు చేసిందని అదే విధంగా అమృత పథకం ఎంపికైనందున నిధులకు ప్రతిపాదనలు పంపించినట్లు కమీషనర్ చెప్పారు. నగరానికి 5 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాలతో కార్పోరేటర్ కలపాలని అంతేకాకుండా ఇటీవల నిజామాబాద్ పట్టణ అభివృద్ది సంస్థను ఏర్పాటకు ప్రభుత్వం జిఓ విడుదల చేసినందున సంబంధించిన స్టాఫ్ ప్యాటర్న నిర్వహించలేదని చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టిన రెండు పడకల గదుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో ఎన్ని రోడ్లు మంజూరు అయ్యాయని, చేపట్టిన రోడ్డు నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న నూతన రోడ్ల నిర్మాణాలను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఎస్‌ఇ మధుసూదన్‌రెడ్డిను ఆదేశించారు.

Comments

comments