Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

సంగీతకు ఊరట

ph

అత్తవారింట్లో సురక్షిత చోటు, నెలకు
రూ.20 వేలు : మియాపూర్ కోర్టు ఆదేశాలు
నా పోరాటం ఫలించింది, మీడియాకు, మహిళ, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు : సంగీత

హైదరాబాద్/బోడుప్పల్ : అత్తంటి నుండి తనకు, తన కూతురికి న్యాయం జరగాలని కోరుతూ గత 54 రోజులుగా దీక్ష చేస్తున్న సంగీతకు మీయాపూర్ కోర్టు ఊరటనిచ్చింది. గత ఏడాది నవంబర్ 19న భర్త చేతిలో తీవ్ర దాడికి గురైన సంగీత నాటి నుండి బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలోని అత్తంటి ముందు న్యాయం కావాలని దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తమ బాగోగులపై కోర్టును ఆశ్రయించిన సంగీతకు గురువారం మియపూర్ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల
జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం శ్రీనివాస్ రెడ్డి తన భార్యను మరియు కూతురు అభిదను పోషించుకోవాలి. ఆమే ప్రస్తుతం ఎక్కడైతే ఉందో అదే ఇంట్లో నివాసం ఉండానివ్వాలని ఆమెకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలి. అలాగే సంగీతకి ఆమె కూతురి పోషణ కోసం ప్రతి నెల 20 వేల రుపాయాలు అందించాలని, ఆమెకు ఏలాంటి హానీ జరుగకుండా చూడాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అత్తింట్లోకి సంగీత : మీయపూర్ కోర్టు సంగీతను ఇంట్లోకి వెళ్లొచ్చనే ఉత్తర్వులు జారీ చేయడంతో సంగీత అత్తింట్లోకి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను ఏ రోజు కుడా చట్టవ్యతిరేఖ పనులు చేయలేదు ఓ మహిళగా, భార్యగా, తల్లిగా నా అత్తామామలను, నా భర్త నుండి నాకు గౌరవ ప్రధమైన న్యాయం కావాలని కోరుకున్నాను. ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు నాలో ఓ కొత్త జోష్‌ను నింపాయి. నా పోరాటం ఫలించింది. ఈ పోరాటంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

Comments

comments