Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

‘నాపేరు సూర్య’ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అదిరింది…

Allu-Arjun

హైదరాబాద్‌: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్నతాజా చిత్రం ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కొత్త సంవత్సరం కానుకగా ఈ మూవీ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను సోమవారం విడుదల చేశారు. ‘నీకు సూర్య అంటే సోల్జర్‌.. కానీ ప్రపంచానికి యాంగర్‌’, ఇలాగైతే చచ్చిపోతావురా అంటే.. ‘చచ్చిపోతా గాడ్‌ఫాదర్‌. కానీ, ఇక్కడ కాదు, బోర్డర్‌కు వెళ్లి చచ్చిపోతాను’ అనే డైలాగ్స్ అర్జున్ దేశ భక్తిని చాటుతున్నాయి.  బన్ని సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్‌-శేఖర్‌ స్వరాలు సమకూరస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై నాగబాబు, శ్రీధర్‌ లగడపాటి భారీగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ ‌ 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments