Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

తండ్రి హిట్స్‌పై కన్నేశాడు

NagaChaitanya

నాగచైతన్య కొత్త కథల కోసం చూడటం మానేసి తన తండ్రి కథల వైపు చూస్తున్నాడు. తండ్రి సినిమాల్లో అది చూడండి… ఇది చూడండి అంటూ దర్శకులకు సలహాలు ఇస్తున్నాడు. కొత్తగా ట్రై చేయడం కంటే ఇదివరకే వచ్చిన కథలను కొత్తగా చూపించడం మంచిదని అనుకుంటున్నాడు ఈ హీరో. ఇప్పటికే గత ఏడాది ‘నిన్నే పెళ్లాడతా’ రీమేక్ అయిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో కెరీర్‌లోనే పెద్ద హిట్ అందుకున్నాడు చైతూ. ఆ సినిమా ఇచ్చిన విజయం నచ్చిందో ఏమో కానీ ఇప్పుడు మరోసారి తండ్రి సినిమాలనే కావాలంటున్నాడు ఈ యంగ్ హీరో. అప్పట్లో ‘హలో బ్రదర్’ రీమేక్‌కు ముహూర్తం పెట్టి ఆపేసిన నాగచైతన్య ఇప్పుడు మరోసారి నాగార్జున ఆల్‌టైమ్ హిట్స్‌పై కన్నేశాడు. మారుతితో ఆయన చేయబోయే సినిమాకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ పెడుతున్నారు. ఇందులో పొగరుబోతు అత్తగా రమ్యకృష్ణ నటించనుంది. ఇక ఈ చిత్రం అప్పట్లో నాగార్జున నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అల్లరి అల్లుడు’కు రీమేక్ అని తెలిసింది. కోదండరామి రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇందులో పొగరుబోతు అత్తగా వాణిశ్రీ నటించడం విశేషం. ఇప్పుడు రమ్యకృష్ణ ఆ పాత్ర చేయనుంది. ప్రస్తుతం దర్శకుడు చందూమొండేటి చిత్రం ‘సవ్యసాచి’తో బిజీగా ఉన్న చైతూ త్వరలో మారుతి సినిమాపై దృష్టిపెట్టనున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Comments

comments