Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌ది అవినీతి కుటుంబం : నాగం

Nagam-Janardhan-Reddy

హైదరాబాద్ : తెలంగాణ సిఎం కెసిఆర్‌ది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి కుటుంబమని మాజీ మంత్రి, బిజెపి నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కెసిఆర్ విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలను సకాలంలో జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ప్రస్తుతం తాను బిజెపిలోనే ఉన్నానని, పార్టీ మారడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఉగాది తరువాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, అది కూడా తన అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర బిజెపి నాయకత్వంపై తన అనుచరులు , కార్యకర్తలు ఒకింత నిరుత్సాహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Nagam Comments on KCR

Comments

comments