లండన్ : బ్రిటన్ మంత్రిగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌ను నియమించారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఇద్దరు భారతీయ సంతతికి చెందిన ఎంపిలకు తన మంత్రివర్గంలో స్థానం కలిపించారు. ఇందులో గోవాకు చెందిన ఫేర్నాండేజ్తో పాటు రిషి సునక్‌లు ఉన్నారు. థెరిసా మంత్రివర్గంలో రిషి సునక్ హౌసింగ్ శాఖ మంత్రిగా పని చేయనున్నారు. నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్మండ్ నుంచి2015లో తొలిసారిగా ఆయన ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2017లో మళ్లీ ఎన్నికయ్యారు. రిషి ఆక్స్ఫర్డ్, స్టాస్ఫర్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్నాడు. ఇక్కడే నారాయణమూర్తి కుమారె అక్షతతో రిషికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.