Search
Saturday 21 April 2018
  • :
  • :

జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడలు షురూ

sports

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: 63వ జాతీయ ఫెన్సింగ్ క్రీడలు ఆహ్లాదకరమైన వాతావరణంలో  నల్లగొండలోని డాన్‌బోస్కో అకా డమీలో మంగళవారం ప్రారంభమై య్యా యి. ఈ క్రీడలను ప్రారంభిం చేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు విచ్చేసి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  కలెక్టర్ మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడల నిర్వహణ క్రీడాకారులకు గుర్తుండి పోయేలా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ పోటీలు ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతాయని ఆయన అన్నారు. ఈ క్రీడాకా రులు పాల్గొంటున్నారని, 150 మంది కోచ్‌లు, 50 మంది టెక్నికల్ మేనే జర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రీడాలు సజావుగా నిర్వ హించేందుకు క్రీడాకారులకు, కోచ్‌లకు, క్రీడాకారుల పేరెంట్స్‌కు మంచి వసతీ సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. వారికి భోజనం, మంచినీరు, లైటింగ్, మరుగు దొడ్లు సక్రమం గా నిర్వ హించేం దుకు సిబ్బందిని నియమించడం జరిగిందని, ఆయన అన్నారు. ఈ క్రీడల ఏర్పాట్లనుపర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారు లుగా జిల్లా అధికారు లను నియమించడం జరిగిందని, వీరందరూ సమన్వయంతో పనిచేసి క్రీడలను విజయ వంతం చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ పూల రవిందర్ మాట్లాడుతూ మనదేశం ఇప్పుడిపుపడే క్రీడల్లో రానిస్తుం దని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ క్రీడల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, ప్రతీ నియోజకవర్గానికి ఒక స్పోట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొంది్ంచడం జరిగిందని ఆ యన తెలిపారు. తల్లి దండ్రులు తమ పిల్లలను విద్యతో పాటు క్రీడాల పట్ల ఆసక్తి కనపర్చే విధంగా చూడాలని ఆయన అన్నారు. మన జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మంచి స్థానాలను సంపాదించాలని ఆయన సూచించారు. జిల్లాలోని విద్యార్థులను జాతీ య స్థాయిలో మంచి క్రీడా ప్రతిభ కనపరిచే విధంగా తయారు చేయా లని ఆయన కోరారు. ప్రతీ విద్యార్థిని విద్యార్థులను క్రీడాకారు లుగా తయారు చేసినట్లయితే, వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిం చినట్లు అవుతుందని ఆయన అన్నారు. ఫెన్సింగ్ క్రీడా రాజరిక వ్యవస్థలో కత్తి సాముగా పిలిచేవారని ఆయన తెలిపారు. ఇంతకు ముందు జాతీయ క్రీడా పథకాన్ని పూల రవీందర్, తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. దోమల గూడ ప్రభుత్వ విద్యార్థిలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. క్రీడలను ప్రారంభ సూచ నగా బెలూన్‌లను గాలిలో ఎగర వేసి క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటిం చారు. ఈ కార్యక్ర మం లో జేసి. నారాయణరెడ్డి, డీఈవో జైనీ చైతన్య, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేఖల భద్రా ద్రి, మహిళ శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ మేలె శరణ్యారెడ్డి, నల్లగొండ టీఆర్‌ఎస్ ఇం చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. నాగిరెడ్డి, డాన్‌బోస్కో అకాడమీ డైరెక్టర్ బాలచౌరీ, క్రీడల అబ్సర్వర్ అజయ్ శర్మ, జిల్లా క్రీడల అభి వృద్ధి అధికారి మబ్గుల్ అహ్మద్, మైనార్టీ సంక్షేమ అధి కారి వెంకటేశ్వర్లు, నల్లగొండ ఆర్‌డీవో వెంకటాచారి పాల్గొన్నారు.

Comments

comments