Search
Tuesday 19 June 2018
  • :
  • :

18 నుంచి జాతీయస్థాయి హ్యాండ్ బాల్ క్రీడలు

games

మన తెలంగాణ/సిద్దిపేట ప్ర తినిధి: సిద్దిపేట మినీ స్టేడియం లో ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేది వరకు 40వ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్న ట్టు కలెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం కలక్టర్ క్యాం పు కార్యాలయంలో  క్రీడల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి నిర్వహ ణ, ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైనజాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల నిర్వహణకు హ్యాం డ్‌బాల్ అసోసియేషన్ సిద్దిపేటలో నిర్వహించేందుకు అనువైన వేదికగా గుర్తించిందని తెలిపారు. ఈ పోటీలకు జాతీయ స్థాయి ఆటగాళ్లు వివిధ రాష్ట్రాల తరపున హాజరవుతారని తెలిఆపరు. వివిధ రాష్ట్రాల నుంచి 700 మంది  క్రీడాకారులు, రాష్ట్రానికో జట్టు నుంచి 18 క్రీడాకారులు సిద్దిపేటకు రానున్నారని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు మౌ లిక సదుపాయాలు కల్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులతో చర్చించి క్రీడలు విజయవంతంగా నిర్వహించడానికి సూచనలు జారీ చేశారు. పోటీకు హాజర య్యే క్రీడాకారులకు రవాణా సౌకర్యం, వసతి, మైదానం, శుభ్రత, భోజ న వసతులు, తాగునీటి సౌకర్యంతో పాటు అన్ని వసతులు కల్పించే విధ ంగా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వొ చంద్రశేఖర్, జి ల్లా యువజన క్రీడాశాఖ అధికారి బాలయ్య, మునిసిపల్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి, డీఈవొ విజయలక్ష్మి, డిఎఓ వేణుమాదవ్, బీసీ కార్పొరేషన్ ఈడీ రాంరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పవన్, మల్లేశం, కనకయ్యలతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments