Search
Tuesday 19 June 2018
  • :
  • :

అత్యాధునిక ఆయుధాలు అవసరం : రావత్

BIPIN

ఢిల్లీ : భారత ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీ అవసరమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌లో యుద్ధాలు చేయాలంటే భారత్‌కు అత్యాధునిక ఆయుధాలు, కొత్త టెక్నాలజీ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరాలకు అనుగుణంగా ఆయుధ వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన చెప్పారు. భారత్‌పై చైనా ఒత్తిడి తెస్తున్న మాట నిజమేనని ఆయన పేర్కొన్నారు. భారత్ – చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. భారత్ భూ భాగంలోకి చైనా చొచ్చుక రాకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉత్తర దిశగా ఉన్న సరిహద్దులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2017లో తమ దృష్టి మొత్తం దక్షిణ కశ్మీర్‌పై పెట్టామన్నారు. ఇప్పుడు ఉత్తర కశ్మీర్‌పై పెడుతున్నట్టు ఆయన చెప్పారు. బరాముల్లా, పట్టాస్, హంద్వారా, కుప్వారా, సొఫైర్, లోబా, బందిపోరా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ గాలింపు చర్యలను విస్తృతం చేసిందని ఆయన వెల్లడించారు. ఆర్మీకి ఉగ్రవాద ప్రభావిత ప్రాంత ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ప్రజలు సహకరిస్తే ఉగ్రవాదులను ఏరివేయడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన పేర్కొన్నారు.

Need more advanced weapons: Rawat

Comments

comments