Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

జనవరి 26న కొత్త పాసుపుస్తకాల పంపిణీ

passbook

జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
మనతెలంగాణ / లింగంపేట: జిల్లాలోని రైతులందరికి జ నవరి 26 నుండి నూతన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేయనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయ ణ చెప్పారు. గురువారం ఆయన లింగంపేట మండలంలో రెవెన్యూ సిబ్బంది చేపడుతున్న మ్యాన్యువల్ 1బీ రికార్డుల నమోదు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో473 రెవెన్యూ గ్రామాలలో భూ ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిందని, మ్యాన్యువల్ 1బీ, మ్యాన్యువల్ పహాణీల తయారీ పనులను రెవెన్యూ సిబ్బందితో కూడిన 50 టీంలతో చేయిస్తున్నామని ఆయన చెప్పా రు. 15 రోజుల్లో డాటా ఎంట్రీ పనులు పూర్తి చేసి గణతంత్ర దినోత్సవ రోజున నూతన పట్టాపాసుపుస్తకాలను రైతులకు అందిస్తామన్నారు.

భూ ప్రక్షాళనలో అవినీతి అక్రమాలు జ రుగుతున్నట్లు వివిధ పత్రికల్లో వస్తున్న వార్త కథనాలలో ఎలాంటి వాస్తవంలేదని కలెక్టర్ అన్నారు. ఒకవేళ ఎక్కడైనా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిని ఉద్యోగంలో నుండి శాశ్వతంగా తొలగిస్తామని కలెక్టర్ చెప్పారు. భూ ప్రక్షాళన కార్యక్రమం పకడ్బందీగా జరిగినందున 99.9 శాతం అక్రమాలు జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు. జిల్లాలోని గాందారి, లింగంపేట మండలాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని,వాటిని 4 రోజుల్లో సరి చేస్తామని చెప్పా రు. జిల్లాలో 3 లక్షల 23 వేల మంది రైతులు ఉన్నారని వారిలో 4 శాతం మంది రైతుల భూములు పలు రకాల వివాదాల్లో ఉన్నాయని చెప్పారు. జిల్లాలో ఒక లక్ష 35 వేల ఎకరాల అసైన్‌మెంట్ భూములు ఉన్నాయని, 12064 ఎకరాల భూములు పీఓటీలో ఉన్నాయని, 725 ఎకరాల భూ ములకు సంబంధించి సివిల్ కోర్టులో, 370 ఎకరాల భూముల కేసులు రెవెన్యూ కోర్టులో ఉన్నాయని, కుటుంబ వివాదాలకు సంబంధించినవి 6700 ఎకరాలు భూములు ఉన్నాయని, 2400 ఎకరాల భూములు సరిహద్దు వివాదాలకు సంబంధించినవి ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పీఓటీ లో ఉన్న 12064 ఎకరాల భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేసామని ప్రభుత్వ సూచనల మేరకు వాటిని పరిష్కరిస్తామని అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదస్పద భూములను వారి ఒప్పందం మేరకు క్లియర్ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్ర భుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేపట్టిందని కలెక్టర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై నీతిఅయోగ్ కమిటీ సభ్యులు తెలంగాణలో పర్యటించి నివేదికను సిద్దం చేశారని , నివేదికను ప్రధానమంత్రికి అందజేస్తారని తెలిపారు. కలెక్టర్ వెంట ఎల్లారెడ్డి ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్ మోతిసింగ్ ఉన్నారు.

Comments

comments