Search
Saturday 21 April 2018
  • :
  • :

నూతన సంవత్సర వేళ విషాదం

 chotu
మన తెలంగాణ / కమ్మర్‌పల్లిః కొత్త సంవత్సర వేళ అనందంలో ఉన్న కుటుంబంలో విషాదం నెలకొంది. నూతన సంవత్సరని పురస్కారించుకోని దేవుడికి అభిషేకానికి వెళ్ళిన ఓ బాలుడు ఆలయంలో చెట్టు విరిగి మిద పడడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన కమ్మర్‌పల్లి మండలం ఊప్లూర్‌లోని శ్రీబాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సొమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన పొతన్నర్ మణికంఠను, (13) అన్న రాహుల్‌ని వారి తల్లి రాణి నూతన సంవత్సర సందర్భంగా అభిషేకం కొసం మండలంలోని ఊప్లూర్ లో గల శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం ఉదయం స్కూటీ పై తీసుకువెళ్ళింది. తల్లి కొడుకులు ఆలయంలో ప్రదర్శణలు చేస్తుండగా ఆలయంలోని కొబ్బరిచెట్టు విరిగి బాలుడు మణికంఠ పై పడింది. దింతో బాలుడి తల పగిలిపొయి మెదడు బయట పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమయంలో సూమారు 30 మంది వరకు భక్తులు ప్రదక్షణలు చేస్తున్నారు. చెట్టు విరిగిపడిన వైపును బట్టి మిగిత భక్తులకు ప్రమాదం తప్పింది. చెట్టు ఉన్న స్థానం నుండి దక్షిణం వైపు విరిగి పడి ఆ చెట్టు ఆలయం పై పడేటట్లుగా చెట్టు వంగిన వాలు ఉంది కాని చెట్టు విరిగి ఊహించాని వాలు వైపు పడడంతో బాలుడు మృతి చెందాడు. ఊహించని ఈ దుర్ఘటన తో భక్తులంత ఒక్కసారిగా రొదనలు పెట్టారు. కళ్ళ ముందే మణికంఠ మృతితో ఏడుస్తు కుప్పకూలిన తల్లి రాణి, అన్న రాహుల్ ని స్థానికులు ఆలయం నుండి బయటకు తీసుకువచ్చారు. పోలీసులు ఘటన స్థాలనికి చేరుకొని పంచానామ నిర్వహించి మృత దేహన్ని పోస్టు మార్టం నిమితం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మణికంఠ హైద్రాబాద్ కె.కె.ఆర్ గౌతం స్కూలో 8వ తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులతో ఇటివల ఇంటికి వచ్చాడు. నూతన సంవత్సర వేళ ఆలయంలో పూజలు చేసుకోని ఇదే రోజు తిరిగి హైద్రాబాద్ వెళ్ళల్సి ఉంది. ఈ లోపే బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళి పోయాడు బాలుని తండ్రి రాము ఉపాధి నిమ్మితం ఇజ్రాయిల్ దేశంలో ఉన్నాడు.

Comments

comments