Search
Friday 20 April 2018
  • :
  • :

లవ్‌ ఛేజింగ్.. ఒకరి మృతి

New-Couple-Car-Met-with-an-

ఖమ్మం: పెద్దలకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్న నవదంపతులు ప్రయాణిస్తున్న కారును అమ్మాయి తరుపువాళ్లు వెంబడించారు. దీంతో వారిని తప్పించబోయి కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా నవదంపతులతో పాటు మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా అనంతారంలో షహేల, సుమన్‌లు ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తమ పెద్దవాళ్లకు తెలిస్తే ప్రమాదమని భావించిన నవదంపతులు తమకు రక్షణ కల్పించాలని ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి తరపు వాళ్లను పిఎస్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అంతేగాక వాళ్లిద్దరూ మేజర్లు కనుక వాళ్ల పెళ్లి చట్ట బద్దంగా చెల్లుతుందని చెప్పారు. దీంతో బంధువులు ఏమి చేయలేక వెనుదిరిగారు. అనంతరం నవదంపతులు ఇల్లెందు నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు వారు ప్రయాణిస్తున్న కారును వెంబండించారు. దాంతో డ్రైవర్ కారు వేగంగా పొనిచ్చాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. నవదంపతులతో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments