Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

‘సూర్యకాంతం’గా నిహారిక

niha

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక. ఆమె హీరోయిన్‌గా పరిచయమైన ‘ఒక మనసు’ అంతగా హిట్ కాకపోయినా రియాలిటీ షోలు,  వెబ్ సిరీస్‌లతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక నిహారిక కోలీవుడ్‌లో ఒక సినిమా చేయగా అది త్వరలో విడుదలకానుంది. ‘ఓరు నల్ల నాల్ పాతు సోల్రేన్’ అనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే మరొక కొత్త కాన్సెప్ట్‌తో నిహారిక ఒక ప్రయోగం చేయబోతోందని తెలిసింది. ‘సూర్యకాంతం’ అనే టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనుందని సమాచారం. ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ప్రణీత్ బ్రమంధపల్లి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నాడు. ఇక అదిత్ అరుణ్, కాళిదాస్ హీరోలు కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారికంగా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ఆతర్వాత షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. మరి నిహారిక ‘సూర్యకాంతం’తో ఎంత వరకు హిట్ అందుకుంటుందో చూడాలి. అలాగే సుమంత్ అశ్విన్‌తో నిహారిక  ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమాతో కూడా వస్తోంది.

Comments

comments