Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

అదే ప్రేమని అనుకుంటారు

Kangana

తన జీవితంలో ప్రేమకిక చోటు లేదని తేల్చేసింది బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్. తెలుగులో ‘ఏక్ నిరంజన్’  చిత్రంలో నటించిన ఈ భామ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే పలువురితో ఎఫైర్స్ నడిపేసింది. సినిమాల్లోకి వచ్చాక ఆ ఎఫైర్లను కొనసాగించింది. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా ఎఫైర్లకు పుల్‌స్టాప్ పెట్టేసి పూర్తిగా నటినపైనే దృష్టిపెట్టి బాలీవుడ్‌లో వరుస విజయాల్ని అందుకుంది కంగనారనౌత్. ఈ భామ యువతకు ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. “భౌతిక ఆకర్షణనే చాలామంది ప్రేమని అనుకుంటారు. మొదట్లో నేను కూడా అలాగే అనుకొని మోసపోయాను. ప్రేమించడానికి మానసికంగా  ఎంతో పరిణతి అవసరం. అప్పుడే సరైన వ్యక్తిని ప్రేమించగల్గుతాం”అని చెప్పింది కంగనారనౌత్.

Comments

comments