Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

చైనా ఫార్మా కంపెనీలకు నోటీసులు

Pharma

న్యూఢిల్లీ: నాసిరకం నాణ్యతతో ఔషధాలు సరఫరా చేస్తున్న ఎనిమిది చైనా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు భారత ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. త్వరలో వాటిని బ్లాక్‌లిస్ట్‌లో కూడా పెట్టనున్నారని సమాచారం. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ)కు చెందిన ప్రత్యేక పరిశీలక బృందం ఎనిమిది చైనా ఫార్మా కంపెనీలను తనిఖీ చేశాక ఈ నోటీసలు ఇచ్చారు. ఆ ఎనిమిది కంపెనీల ఖిలు తియన్హే ఫార్మాస్యూటికల్స్, హినన్ జిన్‌జియాంగ్ ఫార్మాస్యూటికల్స్, జుహై యునైటెడ్ లాబరేటరీస్, గ్వాంగ్జోవో బైయుంషన్ ఫార్మాస్యూటికల్స్, షౌగ్వాంగ్ ఫుకంగ్ ఫార్మాస్యూటికల్స్, క్విలు యాంటీబయోటిక్స్(లిన్‌యీ) ఫార్మాస్యూటికల్స్, ఖిండవో బ్రైట్‌మూన్ సీవుడ్స్, షాంఘై జియాండియా హసెన్(షాంగ్‌ఖ్యు) ఫార్మాస్యూటికల్స్.ఈ కంపెనీలు భారతీయ ఔషధ తయారీ కంపెనీలకు ముడి సరుకును పెద్ద ఎత్తున అందిస్తున్నాయి. ఈ కంపెనీలు అందించే సరుకు నాసిరకమైనవని ఆరోపణ. ‘వాటిపై ఎలాంటి చర్య చేపట్టాలో త్వరలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది,ఇలాంటి నాసిరకం ఔషధాలపై భారత్ రాజీపడబోదు, కఠినంగా వ్యవహరిస్తుంది’ అని డిసిజిఐ సీనియర్ అధికారి తెలిపారు. భారత్ 70 శాతం ఔషధాల ముడిసరుకును చైనా నుండే పొందుతోందని రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. 201617లో రూ. 12,254.97 కోట్లు విలువచేసే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్(ఎపిఐ)ను చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఇది 201516లో రూ. 13,853.20 కోట్లుండేదని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. గమనించాల్సిన విషయమేమిటంటే చైనాకు చెందిన ఎపిఐలు భారత్‌లో తయారయ్యేదానికన్నా నాలుగు రెట్లు చౌక అని ప్రస్తుతం రక్షణ మంత్రిగా పనిచేస్తున్న నాటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2017 మార్చిలో చెప్పారు.

Comments

comments