Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఆగని దందా

gutka

*యథేచ్ఛగా గుట్కా విక్రయాలు
*పాన్ షాపులే అసలు అడ్డాలు
*తెరవెనుక బడా వ్యాపారులు

జుక్కల్: ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు విక్రయాలను నిషేధిస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలనే లక్షంతో పకడ్బందీ నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ అధికారులకు అన్ని విధాల అధికారాలు ఇచ్చినప్పటికీ స్థానిక అధికారులు మాత్రం నిషేధాజ్ఞలు ఆసరా చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే నిషేధిత గుట్కాలను పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద మొత్తం లో దిగుమతి చేసుకుని తమ రహస్య స్థావరాల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. చిన్నా చితక పాన్ షాపులను అడ్డాగా చేసుకుని విక్రయాలు చేపట్టి జీరో రూపంలో ప్రభుత్వాదాయనికి గండి కొట్టే విధంగా కార్యకలాపాలకు పాల్పడటం విడ్డూరం. స్థానిక ఆర్‌టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో గల ఒక పాన్ షాప్‌లో ఓ గోనే సంచిలో నిల్వ ఉంచి అమ్మకాలు సాగించడం సదరు గుట్కా విక్రయాలను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టి కేసులు నమోదు చేయాల్సిన స్థానిక అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వదిలేయడం మామూలైపోయింది. జిల్లా స్థాయి అధికారులను బురిడి కొట్టించే తరహాలో ఇక్కడి అధికారులు తాము చర్యలు తీసుకుంటున్న విధంగా నెలలో ఒకట్రెండు కేసులను నమోదు చేసుకుంటూ ఉన్నతాధికారుల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గుట్కాల విక్రయాల్లో భాగంగా పెద్ద పెద్ద కిరాణ షాపుల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో రాత్రికి రాత్రే తమ సొంత వాహనా ల్లో తెప్పించుకుని రహస్య స్థావరాల్లో నిల్వ చేసుకుని రోజువారీగా నేరుగా గోనే సం చుల్లో చిల్లర దుకాణాలకు సరఫరా చేసి ఈ తతంగం సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో గతంలోనే పలు సంచలనాలను సృష్టించిన అక్రమ గుట్కా వ్యవహారంలో జిల్లా ఎస్‌పి పకడ్బందీ చర్యలు తీసుకున్న దరిమిలా ప్రత్యేక దృష్టి సారించి అక్రమ గుట్కా విక్రయాల విషయంలో అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష ధోరణిపై శాఖపరమైన చర్యలు తీసుకుని గుట్కా స్థావరాలను గుట్టు రట్టు చేయాలని బహిరంగంగా అమ్మకాలు సాగుతున్న గుట్కాలపై తనిఖీలు చేపట్టితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నా రు. జుక్కల్ మండల కేంద్రంలోనే గతేడాది నుంచి భారీ స్థాయిలో గుట్కాలను పోలీసులు పట్టుకున్నారు. కాని దందా నిర్వహిస్తున్న వారికి కొంచెం కూడ భయం లేకుం డా పోయిందనే విమర్శలు ఉన్నాయి. గత గత నెలలోనే బస్సులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు మండల కేంద్రంలోనే పట్టుకుని ఒక అధికారి వదిలేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, కార్ణాటక ప్రాంతాలకు సరిహద్దుల మీదుగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఇంకా గట్టి బందోబస్తు నిర్వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments