Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

తగ్గుముఖం పట్టిన చమురు ధరలు

oilసింగపూర్/ లండన్ : ఈ ఏడాది ప్రారంభంలో క్రూడ్ ఆయిల్ ధలు రెండేళ్ల గరి ష్ఠ స్థాయికి చేరగా, మళ్లి దిగివస్తున్నాయి. అమెరికా ఉత్పత్తిని పెంచడంతో సరఫరా పెరిగి ధరలు తగ్గుతున్నాయి. ఒపెక్(పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ) సభ్య దేశం ఇరాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరాపై పరిమితుల కారమంగా డిసెంబర్‌లో చమురు ధరలుపెరుగుతూ వచ్చాయి. 2018 కొత్త సంవత్సరంలో ధరలు 2015నాటి గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే అమెరికా క్రూడ్ ఉత్పత్తి పెంచడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. యుఎస్ డబ్లుటిఐ(వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియెట్) క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్ 61.40 డాలర్లకు చేరింది. గత ముగింపు కంటే 1 శాతం దిగువన ట్రేడ్ అయింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ 50 సెంట్స్ కోల్పోయి 67.57 డాలర్ల వద్ద ఉంది. అంతకుముందు రోజు ఇది 68. 27 డాలర్లను క్రాస్ చేసింది. కాగా 2015 ద్వితీయార్థంలో చమురు ధరలు బా గా పెరిగాయి. డబ్ల్యుటిఐ క్రూడ్ ఫ్యూచర్ మంగళవారం ఒక బ్యారెల్ ఒక్కింటికి 19 శాతం పెరిగి 60.61 డాలర్ల వద్ద కదలాడింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర పీ పా ఒక్కింటికి 67.20 డాలర్లకు చేరగా, ఈ స్థాయికి చేరడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. అదే సమయం లో ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం వృద్ది బాట పట్టడంతో క్రూడాయిల్‌కు డి మాండ్ పెరిగింది. దీంతో లిబియా పైప్‌లైన్ పునఃప్రారంభం కావడం, ఫోర్టిస్ పైప్‌లైన్ సరఫరా పనరుద్ధరించడం జరిగినా డిమాండ్ పెరుగుతూనే ఉంది. అందువల్ల ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  చైనా నుంచి పెరుగుతున్న డిమాండ్ ధరలను తగ్గకుండా చేస్తోంది. ప్రస్తుతానికి చము రు ధరల భవిష్యత్ ఆశావహంగానే ఉందని మరో విశ్లేషకుడు విలియం ఓలాంగిలిన్ చెప్పారు. 2016 నుంచి అమెరికా చమురు ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే అప్పుడు ఒపెక్, రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చమురు ధరలు ఆధారపడి ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా పతనబాటలో సాగుతున్న ధరలకు నిలకడ తీసుకువచ్చేందుకు గాను ఒపెక్ దేశాలు 2017 జనవరి నుంచీ చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. రష్యా వంటి నాన్‌ఒపెక్ దేశాలు కూడా మద్దతు పలకడంతో ఇటీవల కొంతకాలంగా చమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి.

Comments

comments