Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి

road-accident-image-done

హైదరాబాద్: మణికొండలో గెట్ టూ గెదర్ పార్టీకి వెళ్లి వస్తుండగా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా… నలుగురికి తీవ్రంగా గాయాలపాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అతి వేగంతో డివైడర్, చెట్టును వోక్స్ వ్యాగన్ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంబవించింది. మృతదేహాన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారిని కాచిగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు  కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Comments

comments