Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

తప్పించబోయి… అనంతలోకాలకు!

చెట్టును ఢీకొన్న కారు..
ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
ప్రేమజంటను వెంటాడుతుండగా ఘటన

Car-Accident-in-Khammam

మన తెలంగాణ/ ఖమ్మం అర్బన్: కారు ప్రమాదశాత్తు చెట్టును ఢీకొట్టడంతో ఒకరు అక్కడికి అక్కడే మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన ఖమ్మం సమీపంలోని గోపాలపురంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. ఇల్లందుకు చెందిన శ్రీపతి సుమన్‌గాంధీ, ఎండి షహేల, తరుణ్, రవితోపాటు డ్రైవర్ ఎం.రాజు వీరంతా కలిసి వైరా నుంచి ఖమ్మం వస్తుండగా గోపాలపురం సమీపంలో ప్రమాదవశాత్తు కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఎం.రాజు (23) అక్కడికక్కడే మృతిచెందగా సుమన్ గాంధీ, షహేల, తరుణ్, రవిలకుతీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. వీరిలో తరుణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్లు బంధువులు తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మతాంతర వివాహామే కారణమా?

చెట్టును కారు ఢీకొన్న సంఘటనకు సంబంధించి మతాంతర వివాహామే కారణమని తెలుస్తుంది. ఇల్లందుకు చెందిన శ్రీపతి సుమన్‌గాంధీ వాటర్ సప్లయ్ చేస్తుంటాడు. ఇల్లందులో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది ఎండి షహేల. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. దీనికి పెద్దలు అంగీకరించకపోవడంతో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా అనంతారంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇల్లందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ ఉంటే ప్రాణహానీ ఉంటుందని భావించి కారును అద్దెకు తీసుకుని స్నేహితులైన తరుణ్, రవిలతో కలిసి వారు కొత్తగూడెం వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన షహేల కుటుంబ సభ్యులు,వారిని కారులో ఇల్లందు నుంచి కొత్తగూడెం,కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు సుమన్గాంధీ కారును వెంబడించినట్లు ప్రేమికులుఆరోపించారు. వారు వెంబడించడం వల్లేఅతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొన్నట్లు తెలిపారు. ప్రేమ జంటను కాపాడేందుకు తరుణ్, తన స్నేహితుడైనఎం.రాజు (డ్రైవర్)ను తీసుకుని వచ్చాడు. ఈ క్రమంలో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది

Comments

comments