Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి… ఇద్దరికి తీవ్రగాయాలు

accident
మనతెలంగాణ/ పిట్లం ః కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు సోమవారం బాన్సువాడ నుండి పిట్లం వైపు వస్తున్న టిఎస్ 08 ఎఇ 1691 నంబర్ గల కారు పిట్లం వైపు నుండి బాన్సువాడ వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న పాల్యాబజన్‌లాల్ (45) పెద్దాకోడప్‌గల్ తాండ వ్యక్తి మరణించాడు. ఆయన కుమారుడు పాల్వ దేవిసింగ్‌కి తీవ్రగాయాలయ్యాయి. బైక్ ఢీకొన్న సమయంలో బాన్సువాడ వైపు వెళ్తున్న ఆటోపై వీరు ఎగిరిపడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి చాకలి మైశయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పిట్లం ఎస్సై అంతిరెడ్డి వివరించారు.

Comments

comments