Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

మత్తు విన్యాసమే…. వాళ్ల పాలిట మృత్యువు

Car-Accident

మన తెలంగాణ/ పంజాగుట్ట: జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్‌లో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతిగా మద్యం సేవించి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే బర్కత్‌పూర లో నివాసం ఉంటున్న విశ్వజిత్ మరో ముగ్గురు స్నేహితులైన వివేక్ ,చెన్న కేశవ్ ,పృథ్వి లతో కలసి కారులో మణికోండలోని గెట్ టుగేదర్ పార్టీకి వెళ్ళారు. దీంతో అక్కడ ఫుల్‌గా మద్యం సేవించి తిరుగు ప్ర యాణమయ్యారు. తెల్లవారుజామున ఫీల్మ్‌నగర్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద టీఫీన్ చేసిన వారు తిరిగి మణికోండ వైపు వెళుతుండగా రోడ్డు నంబర్ 78 లోని ప్రశాసన్ నగర్‌లో అతి వేగంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీ కొట్టారు. డివైడర్‌ను ఢీ కొట్టి పక్కనే ఉన్న చెట్టుకు కూడా కారు తగలడంతో వెనుకసీటులో కూర్చున్న విశ్వజిత్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వెనుకభాగం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో వెనుక సీటులో కూర్చున్న విశ్వజిత్ సిటులోనే మృతి చెందాడు.మరో ముగ్గురు యువకులకు పా క్షిక గాయాలు అయ్యాయి. చనిపోయిన విశ్వజిత్ ఇటీవల బాసర దేవాలయంలో విగ్రహం తరలింపు కేసులో మూడవ నిందితునిగా ఉన్నాడు.మృతదేహాన్ని వైద్య పరిక్షల నిమిత్తం గా ంధీకి తరలించారు.  కాగా కేసు నమోదు చే సుకున్న పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments