Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

పాకిస్థాన్ @ 74 ఆలౌట్

boult

బౌల్ట్ మ్యాజిక్, కివీస్‌కు సిరీస్

డునెడిన్: న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ 74 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో 183 పరుగుల భారీ తే డాతో విజయం సాధించిన న్యూజిలాండ్ 30 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 257 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 27.2 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కివీస్ స్పీడ్ స్టర్ బౌల్ట్ 17 పరుగులకే ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ప్రారంభంలోనే బౌల్ట్ దెబ్బ తీశాడు. అతని ధాటికి ఓపెనర్లు అజహర్ అలీ (0), ఫకర్ జమాన్ (2) పరుగులకే పెవిలియన్ చేరారు. మరోవైపు స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ (8) కూడా రనౌటయ్యాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ హఫీజ్ (౦)ను కూడా బౌల్ట్ వెనక్కి పంపాడు. కీలక ఆటగాడు షోయబ్ మాలిక్ (3) కూడా నిరాశ పరిచా డు. ఒక దశలో 32 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన పాక్ చివరి వరుస బ్యాట్స్‌మన్ కాస్త రాణించడంతో 74 పరుగులు సాధించింది. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగతా వారిలో ఫహీం అశ్రఫ్ (10), మహ్మద్ అమేర్ (14), రుమాన్ రయీస్ (16) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. కివీస్ జట్టులో బౌల్ట్ ఐదు, కొలిన్ మున్రో, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు కివీస్ 257 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ ఏడు ఫోర్లతో 73 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. రాస్ టైలర్ (52), లాథమ్ (35), గుప్టిల్ (45) తమవంతు పాత్ర పోషించారు.

Comments

comments