Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కొడు(కన్న)వాడు

ph5

నిరాదరణకు గురి అవుతున్న తల్లిదండ్రులు
చట్టంతో ఆర్తులకు ఆర్డీవో అభయం

నల్లగొండ ప్రతినిధి : తాము పుండై సంతానానికి పండైన తల్లిదండ్రులు వారు. వయ సు మీరుతున్నా కొద్దీ కన్నవారికి బరువౌతున్నారు. ఆ త్మీయ బంధాలు తెంచుకుంటూ ఆధునిక సమాజం అథ:పాతాళానికి చేరువౌతోంది.  సంపన్న కుటుంబాలలోనే అధికంగా అ మ్మా నాన్నలకు ఆదరణ క రువు అవుతోంది.  పేగుబంధాల కోసం రక్తమాంసాల ను రంగరించి వారి  ఉన్నతి కి పాటుపడ్డారు. సీనియర్ సిటిజన్‌లుగా పిలువబడే వీ రు కుటుంభ ఆలనా పాలనకు నోచుకోక  జీవిత చరమాంకంలో కొందరు రోడ్లపైనే గడుపుతున్నారు. ఒక వైపు గ్రహాంతరాసుల కోసం వేట సాగిసున్న  నాగరిక సమాజం మరోవైపు అపరిచితుల్లా ప్రవర్తిస్తున్నారు.  ప్రపంచ సరళీకరణ నేపథ్యంలో కార్పొరేట్ చదువుల కొరకు బాల్యంలోనే కుటుంబానికి దూరమౌతున్న సంతానం ఉన్నత చదువులు, ఉద్యోగాల కొరకు దేశ సరిహద్దులు దాటేస్తున్నవారు, కూలినాలి పనులు చేస్తూ ఇంత గూడును కొంత భూమి సమకూర్చి బతకుదెరువుకు భరోసా పొందినవారు, ఎదిగే వయసుకు కావల్సిన అన్ని వనరులను తమ చెమట చుక్కలతో సమకూర్చిన ఎముకల గూడులుగా మారిన వారిని మరిచిపోతున్నారు. లక్షల కొద్ది ధనం, వందల ఎకరాలున్నా, విలాసవంతమైన  భవనాలున్నా తల్లిదండ్రులపై ఇసుమంత ప్రేమ చూపని వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. జబ్బున పడి అల్లాడుతున్నా దరికి చేర్చుకోని కుమారులు కూతుర్లను చూసి కంటనీరు పెట్టే అభాగ్యులు ఎందరో. ఆదరణ లేని తల్లిదండ్రుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. గ్రామనాయకులు, కులపెద్దలు చెప్పినా పట్టించుకునే వారే లేరు. చేతిలో చిల్లిగవ్వలేక న్యాయం కొరకు కోర్టు మెట్లు ఎక్కలేనివారు ఎందరో. కుటుంబ ఛీత్కారానికి గురై దీనావస్థలో ఉన్న అర్తులకు అభయమిస్తూ ‘తల్లిదండ్రుల వృద్దుల భృతి, సంక్షేమం చట్టం 2007’ పక్కాగా అమలు చేస్తూ తల్లిదండ్రుల కళ్లలో కాంతులు పూయిస్తున్నారు నల్లగొండ ఆర్డీవో ఇ.వెంకటాచారి. 2007 చట్టం ప్రకారం ఆర్డీఓలకు సెషన్స్‌కోర్టు స్థాయి అధికారాలు సంక్రమించినప్పటికి రాష్ట్రంలో మిగతా జిల్లాలో అధికారులు చోరవచూపలేదు. ఆర్డీవో వెంకటాచారి ఈ చట్టాన్ని పూర్తిగా అమలు పరుస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రశంశలు పొందుతున్నారు. తన విధుల్లో భాగంగా చట్టం అమలుకు చర్యలు తీసుకున్నారు. ముందుగా ముగ్గురితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అరుణ, సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా కార్యదర్శి జి. సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మట్టపల్లిని సభ్యులుగా ఆర్డీవో నియమించారు. న్యాయం కొరకు వచ్చే వారి ఫిర్యాదులను ఎటువంటి రుసుము లేకుండా ముందుగా రిజిష్టర్ చేస్తారు. రాయడం రాని వారి నుండి వివరాలు సేకరించి వారికి చదివి వినిపించి సంతకం తీసుకుంటారు. ఫిర్యాదుదారుని కుమారులు, కూతుళ్లకు ఫోన్ చేసి విషయాన్ని వివరించి 15 రోజుల్లో వ్యక్తిగతంగా ఆర్డీవో కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు జారి చేస్తారు. గడువులోగా ఆవ్యక్తి హజరు కానట్లయితే మరోసారి సమాచారం ఇస్తారు. మూడవసారి హజరుకాని పక్షంలో సంబందిత పోలీస్‌స్టేషన్‌కు తెలియపరిచి ఆవ్యక్తిని దగ్గరుండి తీసుక రావల్సిందిగా ఆదేశిస్తారు. అప్పటికి స్పందించక పోతే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ప్రతి మంగళవారం నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో కేసుల పరిష్కారం కొరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. 2014 నుండి ప్రత్యేక శ్రద్దతో అమలు చేస్తూ ఇప్పటి వరకు 80కిపైగా కేసులలో తల్లిదండ్రులకు భృతిని ఇప్పించారు. 2016లో 22 కేసులను, 17 లో28 కేసులు నమోదయ్యాయి. అమానవీయమైన కేసులో ఆర్డీఓ న్యాయం జరిగేలా చూశారు. నల్లగొండ శ్రీరాంనగర్‌కు చెందిన ఓ తండ్రి ఆర్టీసిలో ఎడిసిగా పనిచేసి రిటైరయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇద్దరు కుమారులకే ఖర్చు చేశాడు. కాగా కుమారులు తనను పట్టించుకోకపోవడంతో ఆర్డీఓను ఆశ్రయించారు. తనకు వచ్చే పెన్షన్ రూ.1800 సరిపోవడం లేదని,భృతికి, వైద్యానికి కుమారుల నుండి డబ్బులు ఇప్పించాలని కోరాడు. దాంతో వారి ఇరువురు కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చి నెలనెల వెయ్యి రూపాయలు ఇచ్చేటట్లు చేశా రు. చండూరు మండలంలో తండ్రి చనిపోతే ఆ ఉద్యోగం కొడు కు ఇచ్చారు. కాని ఆప్రబుద్దుడు తల్లిని పట్టించుకోలేదు. ఆమె ఫిర్యాదు మేరకు కొడుకుని పిలిచి భృతిని ఇచ్చి తల్లి ఆలనా పాలనా చూసుకునేలా చేశారు. నల్లగొండ డివిజన్‌లో రెండు వేరువేరు కేసుల్లో సింగపూర్, అమెరికాల్లో నివాసిస్తున్న కుమారులతో మాట్లాడి తల్లిదండ్రుల జీవనానికి అవసరమయ్యే డబ్బు ను పంపేలా చూశారు. ఇలాంటి ఎన్నోకేసుల్లో పేగుబందంతో పెనవేసుకపోయిన మమతలను తుంచి వేస్తున్న వారిపై 2007 చట్టాన్ని అమలు చేస్తూ చితికిన బతుల్లో చిరునవ్వులు పూయిస్తు న్న ఆర్డీవో వెంకటచారిని అభినందనలు అందుకుంటున్నారు. ఈ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తం గా ఆర్డీఓ కా ర్యాలయల్లో అమలు జరిగే లా చర్యలు చే పట్టాలని సీనియర్ సిటిజ న్స్ కోరుతున్నారు.

Comments

comments