Search
Monday 23 April 2018
  • :
  • :

కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా

MOTHERభద్రాద్రి కొత్తగూడెం : కని పెంచారు. కంటికి రెప్పలా చూసుకున్నారు. పెద్దోడు కాగానే తమ కొడుకుకు పెళ్లి చేశారు. అయితే ఆ కొడుకు మాత్రం తల్లిదండ్రుల పట్ల కనీసం జాలి చూపలేదు. వారిని నిత్యం అవమానాలకు గురి చేసేవాడు. భార్యతో కలిసి తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేశాడు. ఎటుపోవాలో తెలియక ఆ తల్లిదండ్రులు కొడుకు ఇంటి ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటన పాల్వంచ మండలం గుట్టాయగూడెంలో జరిగింది.

 Parents dharna before son’s house

Comments

comments