Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి

reddy

*ఆడబిడ్డల సంతోషం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధం
*కలెక్టర్ కార్యాలయంలో 196మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జగదీష్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట: ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ అని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్,ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని 196మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలు చేశారని అన్నారు. తల్లిదండ్రులకు ఆడపిల్ల పుడితే భారం కాకూడదనే ఉద్దేశంతో ఆడపిల్లల పెళ్లి సమయంలో రూ.51వేలను అందివ్వాలని సంకల్పించినట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని రూ.75వేలుగా మార్పు చేశారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో నమ్మకం కలిగించేలా ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం అయిన  మహిళలకు మగ బిడ్డ పుడితే రూ.12వేలు,చ ఆడపిల్ల పుడితే రూ.13వేలు అందివ్వడంతో పాటు 16 రకాల వస్తువులతో కూడిన కేసిఆర్ కిట్‌ను అందిస్తూ దేశంలోనే ఏ ప్రభుత్వం అమలు చేయ్యని సంక్షేమ పథకాలతో ముందున్నదని అన్నారు. 40 ఏళ్లుగా ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నంతో పూట గడుపుతున్నా విద్యార్థుల కోసం సన్నబియ్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు కుటుంబ ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు సిద్దంగా చేశామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోనే 6వేల మందికి రూ.36 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందివ్వడం జరిగిందని తెలిపారు.  మంత్రి సహకారంతో జిల్లాలోని పిహెచ్‌సి అభివృద్ధికి రూ.రెండు కోట్ల నిధులు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, సంయుక్త కలెక్టర్ డి.సంజీవరెడ్డి, ఆర్డీవో మోహన్‌రావు, సూర్యాపేట నియోజకవర్గంలోని ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎమ్మా ర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments