Search
Friday 20 April 2018
  • :
  • :

వేతనం చెల్లించండి

cm

12లోపు కార్మికులకు వేతనం చెల్లించండి

ఫిబ్రవరి 14న కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో కంపెనీ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాలి
ఈసారి నిర్ణయం తీసుకోకపోతే.. కంపెనీ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది
ఉపముఖ్యమత్రి కడియం శ్రీహరి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందులాల్

వరంగల్ బ్యూరో: సంక్రాంతి పండుగ వస్తుంది. పండుగ పూట కార్మిక కుటుంబాలను పస్తులు పెట్టకండి. ఏదిఏమైనా ఈనెల 12వ తేదీలోపు కార్మికులకు ఒక నెల వేతనం చెల్లించాల్సిందేనని ఫ్యాక్టరీ సిఈఒ నిహార్ అగర్వాల్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజనశాఖ మంత్రి చందులాల్, ఎంపి సీతారాంనాయక్‌లు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ (బల్లాపూర్ ఇండస్ట్రీ లిమిటెడ్) కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు, బిల్ట్ సిఇఒ, కంపెనీ ప్రతినిధులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ఫ్యాక్టరీ మూతపడడంతో గత 32నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కం పెనీ తమ గోడును పట్టించుకోవడంలేదని కంపెనీ కార్మికులు మంత్రులకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 2వ తేదీన ఫ్యాక్టరీ ప్రతినిధులు, కార్మికశాఖ అధికారులు, కార్మిక యూనియన్ నేతలతో సమావేశమై చర్చించడం జరిగిందన్నారు. ఈనెల 14, 15 తేదీల్లో సంక్రాంతి పండగ ఉండడంతో ఖచ్చితంగా ఈనెల 12లోపు కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నారు.
ఫిబ్రవరిలో ఫ్యాక్టరీ భవితవ్యాన్ని తేల్చాలి
ఫిబ్రవరి నెలలో బిల్ట్ ఫ్యాక్టరీ భవితవ్యాన్ని తేల్చాలని కంపెనీ ప్రతినిధులతో మంత్రులు హెచ్చరించారు. ప్రధానంగా ఇటీవల పేపర్ పల్ప్‌కు ధర పెరగడంతో ఈ రేయాన్స్ ఫ్యాక్టరీని పేపర్ పల్స్ ఫ్యాక్టరీగా మార్చి నడిపించే ప్రతిపాదనలను పరిశీలించాలని కంపెనీ ప్రతినిధులకు మంత్రులు సూచించారు. లేనిపక్షంలో ఫ్యాక్టరీని మూసివేయాలనుకుంటే కార్మికులకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలన్నారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 14వ తేదీన కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఫ్యాక్టరీ సి ఈఒ చెప్పారు. తుది నిర్ణయం ఫ్యాక్టరీ యజమాన్యం తీసుకోవాలని, ఇంకా నిర్ణయా న్ని వాయిదా వేయడం కుదరదన్నారు. ఈసారి ఫ్యాక్టరీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని తీసుకోలేకపోతే.. ప్రభుత్వం ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాల్సి వస్తుందన్నారు. ఫిబ్రవరిలో కంపెనీ బోర్డ్ మీటింగ్ జరిగిన తరువాత అక్కడ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు ఫిబ్రవరి మూడో వారం లో మరోసారి సచివాలయంలో సమావేశం కావాలని నిర్ణయించారు. వీలైనంత వర కు ఫ్యాక్టరీ నడపడానికి యాజమాన్యాన్ని ఒప్పించి రావాలని కంపెనీ సిఈఒ అగర్వాల్‌కు చెప్పారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ కమిషనర్ భాగ్యనాయక్, బిల్ట్ డిప్యూటి జనరల్ మేనేజర్ వై.కేశవరెడ్డి, బిల్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments