Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి నిలయం

Bollaram

మన తెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్, బొల్లారంలో భారత రాష్ట్రపతి విడిది చేసేందుకు ఉద్దేశించిన రాష్ట్రపతి నిలయంను సాధారణ ప్రజలు సందర్శించేందుకు ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవకాశం కల్పించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి నిలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి దక్షిణాదిలో విడిది చేసి వెళ్లిపోయిన తర్వాత సాధారణ ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు అనుమతించడం సంప్రదాయంగా వస్తోంది. 76 ఎకరాల్లో విస్తరించిన రాష్ట్రపతి నిలయంలో కనులవిందైన నిర్మాణాలున్నాయి. మూలికా ఉద్యానవనంలో 116 రకాల వృక్షాలు ప్రత్యేకమైన ఔషధ సంపద కలిగి ఉన్నాయి. సందర్శకులు రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు వచ్చే సమయంలో క్రమశిక్షణ పాటించాలని, బారికేడ్లను దాటవద్దని, నిషిద్ధ ప్రాంతాల్లోకి వెల్లకూడదని రాష్ట్రపతి నిలయం సూచించింది. వాటర్ బాటిల్స్‌తో సహా తినేందుకు ఎలాంటి ఆహార పదార్థాలు, బ్రీఫ్ కేసులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, మొబైల్స్, రేడియా/ట్రాన్సిసిట్స్,్ర ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని తమ వెంట తీసుకురాకూడదని నిర్దేశించింది. సందర్శకుల సౌకర్యార్థం నిలయంలో ఫుడ్ అండ్ స్నాక్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం ప్రాంగణం విశిష్టతలను సందర్శకులకు వివరించేందుకు గైడ్‌లను అందుబాటులో ఉంచారు. సందర్శకులు గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి ప్రవేశించి గేట్ నెంబర్ 1 నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది.

Comments

comments