Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

నిండు ప్రాణాన్ని బలిగొన్న మాంసాహారం

NON-VEG

లక్నో : మాంసాహారం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తను మాంసాహారం తినడమే కాక తన కూతురికి కూడా తినిపించినందుకు ఓ భార్య భర్తతో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన సదరు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్నోలోని గోమాతినగర్‌లో ఉండే డాక్టర్ ఉమా శంకర్ గుప్తా (43), దీప్తి అగర్వాల్ భార్యాభర్తలు. వీరికి ఆరాధ్య అనే ఆరేళ్ల కూతురు ఉంది. ఉమా శంకర్ గుప్తా మాంసాహారి. ఆయన భార్య దీప్తి పూర్తి శాకాహారి. బుధవారం రాత్రి గుప్తా మాంసాహారం తెచ్చి తాను తిన్నాడు. అంతేకాదు తన కూతురు ఆరాధ్యకు కూడా తినిపించాడు. ఈ విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గుప్తా తన బెడ్‌రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అరగంట అయినప్పటికీ భర్త బయటకు రాకపోవడంతో దీప్తి ఇరుగుపొరుగువారికి సమాచారం ఇచ్చింది. వారొచ్చి బెడ్‌రూమ్ తలుపులను పగులగొట్టి చూశారు. గుప్తా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Person Suicide in Lucknow

Comments

comments