Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

మోడీ అరుదైన ఘనత

MODI

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోడీ మరో అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నేతగా ఆయన మరోసారి రుజువు చేసుకున్నారు. ప్రపంచ ప్రముఖ నేతలపై ఓ అంతర్జాతీయ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో మోడీ మూడో స్థానంలో నిలిచారు. గాలప్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచ ప్రముఖ నేతలపై గత ఏడాది అక్టోబరు -డిసెంబర్ మధ్య ఓ సర్వే నిర్వహించింది. 50 దేశాల్లో ఈ సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానంలో నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మేక్రాన్ రెండో స్థానంలో, భారత ప్రధాని నరేంద్రమోడీ మూడో స్థానంలో నిలిచారు.

PM Modi is No-3 in World

Comments

comments