Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ప్రొటోకాల్‌ పక్కన పెట్టిన మోడీ

Benjamin

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ప్రొటోకాల్‌ను పక్కనబెట్టారు. భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు స్వాగతం పలికేందుకు మోడీ ప్రోటోకాల్ పక్కన బెట్టి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నెతన్యాహు, ఆయన భార్య సారా భారత్‌కు వచ్చారు. వారు ఆరో రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. ఈ క్రమంలోనే మోడీ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి వారిని ఆహ్వానించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబేకి కూడా స్వాగతం పలికేందుకు మోడీ ప్రొటోకాల్‌ను పక్కన బెట్టిన విషయం తెలిసిందే.

PM Narendra Modi Sets Protocol Aside

Comments

comments