Search
Tuesday 19 June 2018
  • :
  • :

విష వాయువు లీక్ : ఒకరు మృతి

VENKAT

భద్రాద్రి కొత్తగూడెం : అశ్వారావుపేటలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. భార జల కార్మాగారంలో విష వాయువు లీకైంది. ఈ ఘటనలో టెక్నిషియన్ వేల్పుల వెంకటరమణ (38) అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటరమణ మృతికి అధికారుల నిర్లక్షమే కారణమని ఆయన బంధువులు ఆరోపించారు. వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకోవాలని తోటి కార్మికులు డిమాండ్ చేశారు. కర్మాగారంలో రక్షణ చర్యలు పెంచాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Poison Gas Leak: One Person killed at Aswaraopeta

Comments

comments