Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

వివాదంలో ‘అజ్ఞాతవాసి’

Pawan-Kalyan

అమరావతి: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘అజ్ఞాతవాసి’. తాజాగా ఈ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేశారో న్యాయవాది. సినిమాలో పవన్ పాడిన ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ సాగే పాటను చిత్రం నుంచి తొలగించాలని విజయవాడ మాచవరం పిఎస్‌లో అడ్వొకేట్ కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కోటేశ్వరరావు పేరుగల వారి మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని ఆయన ఆరోపించడం గమనార్హం. వెంటనే దీన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం విడుదలవుతున్న ‘అజ్ఞాతవాసి’ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విదేశాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా ‘అజ్ఞాతవాసి’ నిలిచింది. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలోనూ ‘అజ్ఞాతవాసి’ ఫీవర్ మొదలైంది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్‌హిట్ అయినా విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై కూడా అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ‘అజ్ఞాతవాసి’ భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన్నట్టు తెలుస్తోంది.

Comments

comments