Search
Saturday 21 April 2018
  • :
  • :

ఉండేనా..! ఊడేనా….?

Telangna

కొత్త జిల్లాల కొనసాగింపుపై సర్వత్రా ఉత్కంఠ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల్లో అలజడి కొత్త జిల్లాల కొనసాగింపుపై పుకార్లు రాష్ట్రపతి ఆమోదంపైనే అందరి చూపుపది కొత్త జిల్లాలకే కేంద్రం సుముఖత..?షాద్‌నగర్ తిరిగి మహబూబ్‌నగర్‌లో చేరునా..?

ఇటీవలే టిఆర్‌టి నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు పాత జిల్లాలల ప్రాతిపదికనేఉద్యోగ నియమాకాలు చేయాలని చెప్పడంతో ప్రజల అనుమానాలకు బలం చేకూరినట్లైంది. తాజాగా మరోసారి రాష్ట్రపతి ఆమోదం లేకుండా కొత్త జిల్లాలలో పరిపాలనఎలా కొనసాగిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగా వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయా జిల్లాలకు చెందిన అధికారపార్టీనేతలు సైతం జిల్లా విభజనలో స్పష్టత లేకపోవడంతో తమ జిల్లాకు ఆమోదం లభించకపోతే ప్రజల్లో తాము ఊనికిని కోల్పోతామని లోలోపల మథనపడుతున్నారు. జిల్లావిభజన అంశం అటు ప్రజలను, ఇటు రాజకీయ నాయకులను ఆందోళనకు గురిచేస్తుంది. కేంద్రం యోచన ప్రకారం జిల్లా విభజన పది జిల్లాలకే పరిమితమైతే ఉమ్మడిమహబూబ్‌నగర్ జిల్లాను కేవలం రెండు జిల్లాలుగా మాత్రమే విభజించే అవకాశాలుఉండడంతో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలే ఉంటాయనే వాదన బలంగావినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన నాయకులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వచ్చినట్లే వచ్చి చేజారిపోతుందేమోననేఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు జిల్లాలకే విభజన పరిమితమైతే వనపర్తిగానీ, నాగర్‌కర్నూల్ గానీ ఏదైనా ఒక్కటే జిల్లాగా ఉంటుందని, నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడడ్డానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడితే వనపర్తిని నాగర్‌కర్నూల్‌లో, జోగులాంబ గద్వాలనుతిరిగి మహబూబ్‌నగర్‌లో చేర్చుతారనే ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే అధికారపార్టీకి మైనస్ అవుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎన్నికల సమయంలోఇచ్చిన హామీల ప్రకారం జిల్లాలను కొనసాగించాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలుచేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం అవగాహన రాహిత్యంతో జిల్లాలను విభజించారనిఅధికారపార్టీపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.టిఆర్‌టి నోటిఫికేషన్‌ను పాత జిల్లాల ప్రతిపాదికనే విడుదల చేసిన ఉద్యోగ నియామకాలను చేపట్టాలని హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.రానున్న పంచాయతీ ఎన్నికలు సైతం ఉమ్మడి జిల్లా పరిధిలోనే జరుగుతాయనేపుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏదీఏమైనా జిల్లాల విభజన ప్రక్రియ మరోసారి చర్చనీయాంశంగా మారింది. జిల్లా విభజనపై రోజుకో ప్రచారం బలంగా వినిపిస్తుండడంతోఆయా జిల్లా ప్రజల్లో, రాజకీయ పార్టీ నాయకుల్లో అలజడి రేగుతోంది.

వనపర్తి జిల్లా కొనసాగింపుకై పట్టు..జిల్లాల విభజనకు ఇంకా రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడంతో పది జిల్లాలకేకేంద్రం ఆమోదం తెలిపితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను రెండు జిల్లాలుగామాత్రమే విభజిస్తే వనపర్తి జిల్లాను కొనసాగించాలని అక్కడి అధికార పార్టీ నేతబలంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విభజించిన జిల్లాలను కుదించాల్సిన పరిస్థితివస్తే వనపర్తి జిల్లాగా ఏర్పాటు చేసి నాగర్‌కర్నూల్‌ను ఇందులో కలపాలని ఆ నేతగట్టిగా ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. తమ ప్రాంతంలో అధికారపార్టీని బలోపేతం చేయాలన్న, రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న జిల్లాగాఉంటేనే సాధ్యమవుతుందని వనపర్తి జిల్లా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.వనపర్తి జిల్లా రద్దైతే తమ ఊనికికే ప్రమాదమని ఆ నేత భావిస్తుండడంతో వనపర్తిజిల్లాను రద్దు చేయొద్దని తన వాణిని గట్టిగా అధినేత వద్ద వినిపిచేందుకుసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు జిల్లా విభజనపై చర్చజరిగినప్పుడు వనపర్తి జిల్లా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల హామీగా నాగర్‌కర్నూల్..ఎన్నికల హామీగా నాగర్‌కర్నూలు జిల్లాను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలకు ఈ జిల్లాను రద్దు చేస్తే పెద్ద మైనస్‌గా మారుతోందని చర్చ జరుగుతుంది. స్థానిక ఎంఎల్‌ఎ ఎన్నో ఏళ్లుగా గత పాలకులు మాటలకే పరిమితం చేసినజిల్లాను తాను సాధించానని తన వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఇప్పుడు జిల్లాను రద్దు చేస్తే ఆయన ఊనికిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అధికారపార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లాలంటే జిల్లాను సాధించామనే ఆయుధం తమకు ఉపయోగమని, జిల్లా రద్దైతే తాము ఎలా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి పక్షాలు సైతం విమర్శలుగుప్పించేందుకు అవకాశం ఇచ్చినట్లెవుై తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో విషయంలో నాగర్‌కర్నూల్ ఎంఎల్‌ఎ సైతం పట్టు వదలని విక్రమార్కుడిలాఅంతర్గతంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా ఫస్ట్కేంద్ర ప్రభుత్వం కేవలం పది కొత్త జిల్లాల ఏర్పాటుకు మాత్రమే మొగ్గుచూపుతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కొత్త జిల్లాల నుంచి కొన్ని జిల్లాలు రద్దు అవుతాయని ప్రచారం జరుగుతుంది. కొత్త జిల్లాలను కుదించాల్సి వస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఫస్ట్ వినిపిస్తున్న పేరు జోగులాంబ గద్వాల. మాజీ మంత్రి డికె అరుణ పట్టుబట్టి జిల్లాను సాధించారని ఇప్పటివరకు కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదంలభించని కారణంగా జిల్లాల రద్దు జరిగితే జోగులాంబ గద్వాల జిల్లా రద్దు అయ్యేఅవకాశాలు మెండుగా ఉండడంతో నడిగడ్డ ప్రాంత వాసులు ఆందోళనకు గురవుతున్నాయి. ప్రభుత్వ అవగాహన లేకుండా జిల్లాలను విభజించడంపై అన్ని వర్గాల్లోఅసంతృప్తి వ్యక్తమవుతుంది.

కొత్త జిల్లాల రద్దు జరిగితే గద్వాల జిల్లాలను తిరిగిమహబూబ్‌నగర్‌లో కలుపుతారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. దీంతో జోగులాంబగద్వాల జిల్లావాసులు నిరాశకు గురవుతున్నారు. జిల్లా ఏర్పడితే అభివృద్ధిలో తమప్రాంతం దూసుకుపోతుందని భావించిన తమకు నిరాశే ఎదురయ్యే అవకాశాలుకనిపించడంతో ఆందోళనకు గురవుతున్నారు.కొత్త జిల్లాల కొనసాగింపుపై అనుమానాలుఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టిఆర్‌టి నోటిఫికేషన్‌ను పాత జిల్లాలప్రాతిపదికననే నిర్వహించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోపలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల కొనసాగింపుపై ప్రజలు,వ్యాపారస్తులు, రియల్టర్లు, రాజకీయ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్తఏర్పడిన జిల్లాలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడానికి బడా వ్యాపారస్తులుసైతం వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారస్తులు కొత్త జిల్లాల్లోఇప్పటికే భూముల ధరలకు రెక్కలు రావడంతో తాము కొనుగోలు చేసిన భూములకుజిల్లా రద్దు అయితే ధరలు తగ్గిపోతాయని, తాము పెట్టుబడులు పెట్టి వ్యాపారాలుచేస్తే నష్టాలు చవిచూసే అవకాశాలు ఉన్నాయని వెనకడుగు వేస్తున్నట్లుగా పుకార్లుషికార్లు చేస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాడ్డక ఆయా జిల్లాల ప్రజలు తమ ప్రాంతంఅభివృద్ధి చెందుతుందని భావించిన తాజాగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలోకొంత నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.రెండు జిల్లాల..నాలుగు జిల్లాల..?కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభించని నేపథ్యంలో, కేంద్రం కేవలం పది కొత్తజిల్లాల ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడిపాలమూరు జిల్లాల ప్రజల్లో రెండు జిల్లాలు ఉంటాయా లేక నాలుగు జిల్లాలు ఉంటాయా అనే చర్చ జరుగుతుంది. కేవలం రెండు జిల్లాలకే ఆమోదం లభిస్తేనాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొనసాగుతాయని, మహబూబ్‌నగర్‌లోగద్వాల, నాగర్‌కర్నూల్‌లో వనపర్తి కలుపుతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.ఇదిలా ఉండగా మరో వైపు వనపర్తి జిల్లాను కొనసాగిస్తారని, నాగర్‌కర్నూల్‌నువనపర్తిలో కలుపుతారనే ప్రచారం సైతం విస్తృతంగా జరుగుతుంది.

ఈ నేపథ్యంలోఉమ్మడి పాలమూర్ జిల్లా ప్రజల్లో, నాయకుల్లో, వ్యాపారుల్లో, రియల్టర్లలో కొత్తజిల్లాల కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ నేతల్లో జిల్లా రద్దు జరిగితేతమకు ప్రజల్లో ఇమేజ్ తగ్గుతుందనే అలజడి మొదలైంది. ఏదీఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి త్వరగా కొత్త జిల్లాలపై ఆమోదం తీసుకొనిప్రజల అనుమానాలను పట్టాపంచాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రాష్ట్రప్రభుత్వం కొత్త జిల్లాల కొనసాగింపుపై స్పష్టత ఇస్తే అందరి అనుమానాలకు,ప్రచారాలకు తాళం వేసినట్లైవుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల విభజన, కొనసాగింపుపై జరుగుతున్న ప్రచారంలోనిజం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టత వస్తేగానీ ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడేటట్లుగా కనిపించడం లేదు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ఈ విషయంపై స్పష్టత తీసుకువచ్చి, జిల్లాల కొనసాగింపుపై జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.షాద్‌నగర్ తిరిగి మహబూబ్‌నగర్‌లో చేరునా..? కొత్త జిల్లాల విభజనపై కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో వస్తున్నపుకార్ల నేపథ్యంలో షాద్‌నగర్ నియోజకవర్గం తిరిగి మహబూబ్‌నగర్ జిల్లాలోనేకలుస్తుందనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇటీవల హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికికేంద్రం, రాష్ట్రపతి ఆమోదం లేకుండా 31 జిల్లాలలో పరిపాలన ఎలా కొనసాగిస్తారనిప్రశ్నించిన విషయం విధితమే. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కేవలం పది కొత్తజిల్లాలకే ఆమోదం తెలిపితే కొత్త ఏర్పడిన జిల్లాల నుంచి కొన్ని జిల్లాలను రద్దుచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కలిసిన షాద్‌నగర్ నియోజకవర్గం తిరిగి మహబూబ్‌నగర్‌లోకలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దీంతో జిల్లా విభజనపై తాజాగాజరుగుతున్న చర్చల్లో తిరిగి షాద్‌నగర్ మహబూబ్‌నగర్‌లో కలుస్తుందనే ప్రచారంబలంగా జరుగుతుంది.షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలు సైతం రంగారెడ్డి కన్నామహబూబ్‌నగర్‌లోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్‌ను తిరిగిమహబూబ్‌నగర్‌లో కలుపాలని నిరసనలు, ధర్నాలు సైతం నిర్వహించిన సందర్భాలుఉన్నాయి. జిల్లా విభజన, రాష్ట్ర ఆమోదం, తదితర అంశాల నేపథ్యంలో తాజాగాజరుగుతున్న చర్చల్లో జిల్లా రద్దు గనక జరిగితే షాద్‌నగర్ తిరిగి మహబూబ్‌నగర్‌లోచేరేనే అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదీఏమైనా ఎలాంటి ప్రచారాలు, పుకార్లుషికార్లు చేసిన జిల్లాల విభజనపై కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకువేచివుండక తప్పదు.

Comments

comments