Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్‌లో చేరిన పోట్ల

POTLA1

ఢిల్లీ : టిఆర్‌ఎస్ నేత, మాజీ ఎంఎల్‌సి పోట్ల నాగేశ్వరరావు శనివారం కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందంటూ ఇటీవల పోట్ల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌కు ఆయన రాజీనామా చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు పోట్ల కాంగ్రెస్‌లో చేరాల్సి ఉన్నప్పటికీ, అధికార పార్టీ నుంచి వస్తున్నందున తాను ప్రత్యేకంగా కాంగ్రెస్‌లో చేరుతానని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రేణుకా చౌదరి నాయకత్వంలో శనివారం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పోట్లతో పాటు వైరా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాందాస్ నాయక్, పలువురు ఎంపిటిసిలు, సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు.

Potla Nageswara Rao Join in Congress

Comments

comments