Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

విద్యతోనే పేదరిక నిర్మూలన

jg

కేతేపల్లి: విద్యతోనే పేదరిక ని ర్మూలన, అనాగరికత దూరమవుతుందని అటవీ, సి సంక్షేమ శాఖ మంత్రి, జోగు రామన్న అన్నా రు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా కే తేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు వద్ద ఉన్న బిసి రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, కళాశాలను నకిరేకల్ ఎంఎల్‌ఎ వేముల వీరేశం, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కు ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యాబోధనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఒకేసారి 119గురుకుల పాఠశాలలను ఏ ర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నా రు. గతంలో విద్యా వ్యవస్థను పాలకులు పట్టించు కోలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యా విప్లవం మొదలైందన్నారు. వచ్చే విద్యా సంవత్స రం నుంచి రాష్ట్రంలో మరో 119 గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు, అందుకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. అద్దె భవనాల్లో కొనసాగు తున్న రెసిడెన్షియల్ పాఠశాలలను పక్కా భవనం లోకి మార్చేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో 50శాతం ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయిస్తామని చె ప్పారు. రాష్ట్రంలో సివిల్స్ చదివేందుకు 500 మం దిని ఎంపిక చేసుకొని ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మోహన్‌కుమార్, టిఆర్‌ఎస్ మండలా ధ్యక్షుడు సుందర్, ఎఇ రవి, విఆర్‌ఒ ఎన్.జోజీ, కాంట్రాక్టర్ తదితరులున్నారు. నేతికి పరామర్శ: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ, అటవీ శా ఖల మంత్రి జోగు రామన్న మంగళవారం పరామ ర్శించారు. నేతి విద్యాసాగర్ మాతృమూర్తి నేతి రాధమ్మ అనారోగ్యానికి గురై సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే.

Comments

comments