Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించాలి

ask

నిజామాబాద్ కలెక్టర్‌గా ఎం.ఆర్.ఎం.రావు
మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో
నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఎం.ఆర్.ఎం.రావు బదిలీపై వచ్చారు. మంగళవారం రాష్ట్రంలో భారీగా జరిగిన బదిలీల్లో పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.ఆర్.ఎం. రావును నియమించారు. గతంలో ఇక్కడ పనిచేసిన యోగితా రాణా హైదరాబాద్ బదిలీ కాగా అప్పటి నుంచి సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యత నిర్వహిస్తున్నారు. బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా బదిలీ అయ్యారు. ఆమెను జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్‌గా నియమించారు. సిక్తా పట్నాయక్ స్థానంలో ఐఎఎస్ 2015 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ జయంతిని బోధన్ సబ్ కలెక్టర్‌గా నియమించారు. ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను తప్పనిసరిగా 15 రోజుల్లో పరిష్కరించాలని ఇన్‌చార్జీ కలెక్టర్ ఎ. రవీంధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రజావాణి సందర్బంగా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలకు రావాల్సిన అధికారులు ఆలస్యంగా అధికారులు రావద్దని తెలిపారు. ప్రజావాణికి మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరం చేస్తారనే భావనతో ప్రజలు జిల్లా కేంద్రాలకు వస్తున్నారని చెప్పారు. జిల్లా బాధ్యులు రాని సందర్భంలో కిందిస్థాయి అధికారులు పంపించే సందర్బంలో శాఖ సంబంధించిన ఆర్జిల పరిష్కర వివరాలకు సంబంధించిన రిజిస్ట్రర్ తీసుకొని రావాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరం కానీ పక్షలో ఆర్జిదారునికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఆరర్జిల రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత నివ్వడం జరుగుతున్నదని, పరిపాలన సౌలభ్యం కొరకు చిన్నచిన్న మండలాలు జిల్లాలో ఏర్పాట అయినందున జాప్యం జరగవద్దని చెప్పారు. ఏదైన విచారణ చేయు సందర్బంలో పిర్యాదుదారుడు  ముందు పారదర్శకంగా విచారణ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో  డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments