Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

‘మొత్తం మానవత్వం చచ్చిపోయింది’

 int

చిన్నారి హత్యాచారం ఘటనపై పాకిస్థాన్ టివి యాంకర్ ఆవేదన  కూతురితో కలిసి న్యూస్ రీడింగ్

ఇస్లామాబాద్: కసుర్‌లో 8 ఏళ్ల చిన్నారి హత్యాచారంపై పాకిస్థాన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సమా టివి న్యూస్ యాంకర్ అయితే ఏకంగా తన కూతురుతో కలసి బుధవారం న్యూస్ బులెటిన్‌ను ప్రసారం చేసింది. ఒళ్లో తన చిన్నారిని పెట్టుకుని కిరణ్ నాజ్ న్యూస్ బులెటిన్‌ను ప్రసారం చేసింది.‘నేను ఈరోజు కిరణ్ నాజ్‌ను కాదు. ఓ తల్లిని. అందుకే నేను నా కూతురితో ఇక్కడ కూర్చున్నాను’ అనిమొదలెట్టింది. పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలను నాజ్ ఖండించింది. ‘చిన్నారుల శవపేటికలు చాలా బరువైనవని అంటారు. ఆ చిన్నారి శవపేటిక భారం మొత్తం పాకిస్థాన్‌పై పడింది’ అని ఆమె మార్మికంగా చెప్పా రు. పంజాబ్‌లో 8 ఏళ్లపై జరిగిన హత్యాచారం హింసాత్మక నిరసనలకు దారి తీసింది. బుధవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు కూడా. భారత సరిహద్దుకు కాసింత దూరంలోనే కసుర్ పట్టణం ఉంది. అక్కడే ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 4న ట్యూషన్ సెంటర్ నుంచి ఆ చిన్నారి అదృశ్యం అయింది. ఆ చిన్నా రి తల్లిదండ్రులు పవిత్ర యాత్ర చేయడానికి సౌదీ అరేబియా వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులతో ఉన్న ఆ చిన్నారి సిసిటివి ఫుటేజిని ఆమె కుటుంబ సభు లు సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఆ చిన్నారిని గొంతు నులుమి చంపే ముందు ఆమె అనేకసార్లు అత్యాచారం జరిగిందని సమాచారం.  ‘ఆ అమ్మాయికి న్యాయ జరగాలి, చనిపోయింది ఓ చిన్నారి కాదు..చనిపోయింది మొత్తం మానవత్వం’ అని  నాజ్ తన వార్తా బులెటిన్‌ను ముగించారు. సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చిన ఆ చిన్నారి తండ్రి న్యాయం జరిగేంత వరకు తన కూతురి పార్థివ శరీరాన్ని ఖననం చేయనని అన్నారు.

Comments

comments