Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

కార్టోశాట్-2 విజయవంతం ..దేశానికే బహుమతి: శివన్

Shivan

హైదరాబాద్: పిఎస్‌ఎల్‌విసి-40 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. కార్టోశాట్-2 విజయవంతంకావటం దేశానికే బహుమతి అని ఇస్రో చైర్మన్ శివన్ కొనియాడారు. పిఎస్‌ఎల్‌విసి-40 విజయవంతానికి కృషి చేసి ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలు చేపడుతామని స్పష్టంచేశారు. చంద్రయాన్-2, జిఎస్‌ఎల్‌వి మార్క్-2 ప్రయోగానికి సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. అద్భుత విజయంతో కొత్త చైర్మన్‌కు స్వాగతం పలికామని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ,  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు,  వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.

Comments

comments